Temple Bell :గుడి గంట వెనుక ఆశ్చర్చపరిచే సైన్స్ .. ఆ ఏడు సెకన్ల రహస్యం తెలుసుకోండి..

Temple Bell గుడి గంటలను తయారు చేయడానికి కాడ్మియం, సీసం, రాగి, జింక్, నికెల్, క్రోమియం , మాంగనీస్ వంటి వివిధ లోహాలను ఒక ప్రత్యేకమైన నిష్పత్తిలో కలుపుతారు.

Temple Bell

మనం హిందూ ధర్మంలో ఏ గుడికి వెళ్లినా(Temple Bell), గర్భాలయంలోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా గంట కొడతాం. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే.. గుడి గంట కొట్టడం ద్వారా దేవుడిని నిద్రలేపుతున్నామని లేదా మన రాకను దేవుడికి తెలియజేస్తున్నామని అనుకుంటాం.

కానీ, ఈ సాంప్రదాయం వెనుక మన పూర్వీకులు ఒక అద్భుతమైన శాస్త్రీయ కోణాన్ని దాచిపెట్టారు. గుడి గంట అనేది కేవలం శబ్దం చేసే లోహం కాదు, అది ఒక శక్తివంతమైన వైబ్రేషన్ కలిగించే సాధనం. అది మన మనసును, శరీరాన్ని ,మెదడును ఎలా ప్రభావితం చేస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ముందుగా గుడి గంట(Temple Bell)ను ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలి. గుడి గంటలు సాధారణ ఇనుము లేదా రాగితో మాత్రమే తయారు చేయబడవు. వీటిని తయారు చేయడానికి కాడ్మియం, సీసం, రాగి, జింక్, నికెల్, క్రోమియం , మాంగనీస్ వంటి వివిధ లోహాలను ఒక ప్రత్యేకమైన నిష్పత్తిలో కలుపుతారు.

ఈ లోహాల మిశ్రమం వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం ఏమిటంటే.. గంటను కొట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన ధ్వనిని ఉత్పత్తి చేయడం. ఈ ధ్వని మన మెదడులోని ఎడమ కుడి భాగాలను ఏకం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక రకమైన హీలింగ్ సౌండ్ లాగా పనిచేస్తుంది.

మనం గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా తీక్షణంగా, స్పష్టంగా,సుదీర్ఘంగా ఉంటుంది. ఈ ధ్వని ద్వారా వచ్చే ప్రతిధ్వని (Echo) కనీసం ఏడు సెకన్ల పాటు మన చెవులకు వినిపిస్తూనే ఉంటుంది. ఈ ఏడు సెకన్ల సమయం చాలా కీలకమైనది.

Temple Bell

ఎందుకంటే, ఆ ఏడు సెకన్లలో ఆ ధ్వని తరంగాలు మన శరీరంలోని ఏడు ముఖ్యమైన శక్తి కేంద్రాలను అంటే ఏడు చక్రాలను (Seven Chakras) తాకుతాయి. ఈ ప్రక్రియ వల్ల మన శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. మనసులో ఉన్న వేలకొద్దీ ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయి, మన మెదడు పూర్తిగా శూన్య స్థితిలోకి వెళ్తుంది.

సాధారణంగా మనం గుడికి వెళ్ళేటప్పుడు బయటి ప్రపంచంలోని ఎన్నో సమస్యలు, ఆలోచనలు, టెన్షన్లతో వెళ్తుంటాం. ఆ స్థితిలో దేవుడిని దర్శించుకుంటే మనసు లగ్నం కాదు. అందుకే గర్భాలయంలోకి వెళ్ళే ముందు గంట కొట్టాలి. ఆ గంట నుంచి వచ్చే తీక్షణమైన ధ్వని మన మెదడుకు ఒక ‘రీసెట్ బటన్’ లాగా పనిచేస్తుంది.

ఆ శబ్దం వినగానే మన మెదడులోని అనవసరమైన ఆలోచనలన్నీ ఒక్క క్షణం ఆగిపోతాయి. దీనివల్ల మన మనసు అత్యంత ఏకాగ్రతతో (Focus) దేవుడి విగ్రహంపై లేదా ప్రార్థనపై దృష్టి పెట్టగలుగుతుంది. ఈ స్థితిని సైకాలజీలో ‘కాన్షియస్ స్టేట్’ అని పిలుస్తారు. అంటే మనసు పరిపూర్ణంగా ప్రస్తుత క్షణంలో ఉండటం.

కేవలం మానసిక ప్రశాంతత మాత్రమే కాదు, గుడి గంట(Temple Bell) శబ్దం వల్ల శారీరక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ గంటల ద్వారా వచ్చే వైబ్రేషన్లు మన చుట్టూ ఉన్న గాలిలోని క్రిములను, బ్యాక్టీరియాను చంపేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

అందుకే పూర్వం అంటువ్యాధులు వ్యాపించినప్పుడు లేదా విశేష పర్వదినాల్లో గుడి గంటలను ఎక్కువగా మోగించేవారు. ఇది ఒక రకమైన గాలిని శుద్ధి చేసే ప్రక్రియగా పనిచేస్తుంది. అలాగే, ఆ ధ్వని తరంగాలు మన వినికిడి శక్తిని పదును పెడతాయి మరియు మన రక్తప్రసరణలో సానుకూల మార్పులు తీసుకొస్తాయి.

గుడి గంట (Temple Bell)నుంచి వచ్చే ఆ ‘ఓం’ కార ధ్వని మెదడులోని నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల రక్తపోటు (Blood Pressure) తగ్గడం, ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడం జరుగుతుంది. గంట కొట్టడం అనేది ఒక ఆధ్యాత్మిక క్రియగా కనిపిస్తున్నా .. అది నిజానికి మన మెదడును ధ్యాన స్థితికి (Meditative State) సిద్ధం చేసే ఒక పద్ధతి.

అందుకే మన పెద్దలు ఏ పని చేసినా దాని వెనుక ఒక అర్థం, పరమార్థం మరియు విజ్ఞాన శాస్త్రాన్ని జోడించేవారు. మనం కూడా ఈ విషయాలను తెలుసుకుని ఆచరిస్తే, ఆ ఆచారాల పట్ల గౌరవం పెరగడమే కాకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

అందుకే ఇకపై గుడికి వెళ్ళినప్పుడు గంటను కేవలం అలవాటుగా కాకుండా, అది మన మెదడును ఎంతలా ప్రశాంతపరుస్తుందో గమనిస్తూ కొట్టండి. ఆ ఏడు సెకన్ల ప్రతిధ్వనిని ఆస్వాదించండి. అప్పుడు మీరు పొందే దైవ దర్శనం మరింత అనుభూతినిస్తుంది. సైన్స్, సంప్రదాయం కలిస్తే ఎంతటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి గుడి గంట ఒక చక్కని ఉదాహరణ.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version