Virat Kohli: ఆర్సీబీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఐపీఎల్ కు విరాట్ కోహ్లీ వీడ్కోలు ?

Virat Kohli:ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. పంజాబ్ కింగ్స్ ను ఓడించి 17 ఏళ్ళ నిరీక్షణకు ముగింపు పలికి ఛాంపియన్ గా నిలిచింది.

Virat Kohli

వరల్డ్ క్రికెట్ లో ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతంగా ఆడే అతికొద్దిమంది ఆటగాళ్ళలో విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఫార్మాట్ లోనైనా పరుగుల వరద పారించడమే కోహ్లీ పని.. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. టీమిండియా చారిత్రక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత పొట్టి క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ టూర్ కు ముందు టెస్టులకు సైతం వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్(Virat Kohli) ఐపీఎల్ లోనూ అభిమానులను అలరిస్తున్నాడు. కానీ ఇకపై ఐపీఎల్ లో కోహ్లీ కనిపించకపోవచ్చు.

వచ్చే సీజన్ లో అతను ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పబోతున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్సీబీ రెన్యువల్ కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదని తెలుస్తోంది.

Virat Kohli

ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. పంజాబ్ కింగ్స్ ను ఓడించి 17 ఏళ్ళ నిరీక్షణకు ముగింపు పలికి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో కోహ్లీ కూడా ట్రోఫీ గెలిచిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు. అయితే తాను ఆర్సీబీకి ఎప్పటినుంచో టైటిల్ అందించాలన్న కల నెరవేరడంతో ఇక ఐపీఎల్ నుంచి కూడా తప్పుకోవాలని కోహ్లీ భావిస్తున్నట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే కుర్రాళ్ళకు అవకాశమివ్వాలన్న ఉద్దేశంతో పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు.

ఇప్పుడు అదే బాటలో ఆర్సీబీకి కూడా వీడ్కోలు పలికేందుకు అతను సిద్ధమైనట్టు కథనాలు వస్తున్నాయి. నిజానికి ఆర్సీబీతో ఆటకు మించిన అనుబంధం కోహ్లీకి ఉంది. కోహ్లీ కారణంగానే బెంగళూరు 17 ఏళ్ళుగా టైటిల్ గెలవకపోయినా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. బ్రాండ్ వాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆర్సీబీ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే ఆర్సీబీ అనేలా ఫ్యాన్స్ లో క్రేజ్ ఉంది. అందుకే ఆ ఫ్రాంచైజీతో విరాట్ కు మంచి బాండింగ్ ఏర్పడిపోయింది. వేరే ప్లేయర్ కు కూడా సాధ్యం కాని విధంగా ఇన్నేళ్ళఉ ఒకే ఫ్రాంచైజీకి ఆడిన రికార్డ్ అతని సొంతమైంది.

టీ20, టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ(Virat Kohli) ఎక్కువగా కుటుంబంతోనే గడుపుతున్నాడు. తన సతీమణి అనుష్కశర్మతో కలిసి లండన్ లో సెటిలైన విరాట్ కోహ్లీ ఫ్యామిలీకే ప్రాధాన్యతనిస్తున్నాడు. 17 ఏళ్ళకు పైగా కెరీర్ లో ఎన్నో రికార్డులు, ఎన్నో పరుగులు చేస్తూ క్రికెట్ కే అంకితమైన విరాట్ ఇప్పుడు కుటుంబంతోనే ఉండాలని నిర్ణయించుకోవడం కూడా ఐపీఎల్ నుంచి తప్పుకునే ఆలోచనకు కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఐపీఎల్ రిటైర్మెంట్ పై కోహ్లీ నుంచి గానీ, ఆర్సీబీ నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version