T20 World Cup
టీ ట్వంటీ ప్రపంచకప్ (T20 World Cup) లో బంగ్లాదేశ్ ఆడడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పలుసార్లు ఐసీసీ చెప్పినా భారత్ కు వచ్చేందుకు ససేమీరా అంటున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్ లో ఆడేది లేదని స్పష్టం చేస్తూ తమ వేదికల మార్పుపై కీలక డిమాండ్ పెట్టింది. తమ దేశానికి వచ్చిన ఐసీసీ సభ్యులతో చర్చల సందర్భంగా బీసీబీ ఓ ప్రతిపాదన చేసింది. తమ గ్రూప్ మార్చాలని కోరింది. ఐర్లాండ్ స్థానంలో తమకు చోటు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడు టీ ట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్ లన్నింటికీ శ్రీలంకే వేదికగా ఉంటుందని, ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెబుతోంది.
ముందుగా విడుదల చేసిన ట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్ (T20 World Cup) షెడ్యూల్ ప్రకారం ఐర్లాండ్ గ్రూప్ బిలో చోటు దక్కించుకుంది. ఆ గ్రూపులో ఒమన్, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఉండగా.. ఐర్లాండ్ మ్యాచ్ లన్నీ కూడా శ్రీలంకలోనే జరగనున్నాయి. దీంతో భారత్ తో ఎటువంటి సమస్యలు లేని ఐర్లాండ్ ను గ్రూప్ మార్చాలని బీసీబీ కోరుతోంది.
ఐర్లాండ్ ముంబై, కోల్ కత్తాలో ఆడేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వ్యాఖ్యానించింది.అప్పుడు ట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్ (T20 World Cup) టికెట్ల మార్పు, హోటల్ బస తప్పిస్తే షెడ్యూల్ మార్చే పని ఉండదంటూ బంగ్లా బోర్డు ఐసీసీ దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై ఐసీసీ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం బంగ్లా టూర్ లోనే ఉన్న ఐసీసీ ప్రతినిధుల బృందం బంగ్లా బోర్డును ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు.
అయినప్పటకీ బీసీబీ ఎక్కడా బెట్టు వీడడం లేదు. బంగ్లాలో హిందువుల హత్యకు నిరసనగా ఐపీఎల్ నుంచి ముస్తఫిజుర్ రహమాన్ ను తప్పించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిని సీరియస్ గా తీసుకున్న బీసీబీ ప్రతీకార చర్యలకు దిగింది.
బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేసింది. అదే సమయంలో టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ఆడేందుకు భారత్ కు వచ్చేది లేదని పట్టుబడుతోంది. షెడ్యూల్, లాజిస్టిక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయని బీసీసీఐ స్పష్టం చేసినా, ఐసీసీ పదే పదే కోరినా బంగ్లా బోర్డు ఓవరాక్షన్ చేస్తోంది. ఇప్పుడు గ్రూప్ మార్చాలంటూ కొత్త డిమాండ్ ను తీసుకొచ్చింది.
IND vs NZ : ఇండోర్ లో గెలిచేదెవరు ?..సిరీస్ డిసైడర్ కు భారత్, కివీస్ రెడీ
