Shubman Gill: శుభమన్ గిల్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ టీమ్ లో నో ప్లేస్

Shubman Gill: వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ (Shubman Gill)పై వేటు పడింది. పేలవ ఫామ్ లో ఉన్న గిల్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు.

Shubman Gill

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ప్రకటన వచ్చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం చోటు చేసుకుంది. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ (Shubman Gill)పై వేటు పడింది. పేలవ ఫామ్ లో ఉన్న గిల్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. వైస్ కెప్టెన్సీగా ఎంపిక చేసిన ఫ్యూచర్ లో టీ20 జట్టుకు సారథిగా చేస్తారని వార్తలు వస్తున్న వేళ గిల్ కు మెగాటోర్నీలో చోటు దక్కకపోవడం ఆశ్చర్యమే.

గిల్(Shubman Gill) కోసం సంజూ కెరీర్ నాశనం చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలు ఎక్కువవడంతో సెలక్టర్లు తలొగ్గక తప్పలేదు. వచ్చే ప్రపంచకప్ లో అభిషేక్ శర్మ , సంజూనే ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా. శివమ్ దూబేల ఎంపిక ఊహించిందే. సౌతాఫ్రికాతో చివరి టీ20లో తిలక్ దుమ్మురేపాడు.ఇక పాండ్యా కూడా అదరగొట్టేశాడు. పాండ్యా, దూబేలు పేస్ ఆల్ రౌండర్లుగా కీలకం కాబోతున్నారు. అయితే వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా సెలక్టర్లు షాకిచ్చారు.

Shubman Gill

అతన్ని ప్రపంచకప్ కు ఎంపిక చేయలేదు. ఫినిషర్ రోల్ లో రింకూ సింగ్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపడంతో మళ్లీ రింకూ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వ్యక్తిగతంగా రాణించడంతో పాటు జార్ఖండ్ ను విజేతగా నిలబెట్టాడు. రెండు సెంచరీలతో ఏకంగా 500కు పైగా పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో అతన్ని తీసుకోక తప్పలేదు.

స్పిన్ ఆల్ రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. గిల్ (Shubman Gill)పై వేటు పడడంతో అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ప్రధాన స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్ లో వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. కీలక వికెట్లు పడగొడుతూ భారత్ విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. అటు పేస్ విభాగంలో బుమ్రా, అర్షదీప్ లతో పాటు హర్షిత్ రాణాకు చోటు దక్కింది.

ఇదిలా ఉంటే వరల్డ్ కప్ కు ముందు జరిగే కివీస్ తో సిరీస్ లోనూ ఇదే జట్టు ఆడుతుంది. కాగా టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరుగుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో ఈ సారి 20 జట్లు పోటీ పడుతున్నాయి.తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. టోర్నీలో హైవోల్టేజ్ మ్యాచ్ ఇండియా-పాక్ జట్లు మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో తలపడతాయి. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version