Cricket
ఆస్ట్రేలియా టూర్ ను భారత జట్టు పరాజయం ఆరంభించింది. శుభమన్ గిల్ సారథ్యంలో తొలిసారి వన్డే(Cricket)ల్లో బరిలోకి దిగిన టీమిండియాకు సరైన ఆరంభం దక్కలేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో చిత్తుగా ఓడిపోయింది. పేస్ పిచ్ పై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయిన వేళ మన బ్యాటర్లు చేతులెత్తేశారు. ఎన్నో అంచనాల మధ్య రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ , కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మిగిలిన బ్యాటర్లలో రాహుల్, అక్షర్ పటేల్ తప్పిస్తే అంతా విఫలమయ్యారు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమై ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఈ (Cricket)మ్యాచ్ లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగింది. పాండ్యా గాయంతో దూరమవడంతో నితీశ్ కుమార్ రెడ్డి వన్డే అరంగేట్రం చేశాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభం నుంచే తడబడింది. పిచ్, వాతావరణ పరిస్థితులు కూడా కలిసిరావడంతో ఆసీస్ పేసర్లు చెలరేగిపోయారు.
తమ ప్రధాన ఆయుధం పేస్ తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 8, గిల్ 10 , విరాట్ కోహ్లీ డకౌటయ్యాడు. అయితే పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో ఓవర్లను కుదిస్తూ వచ్చారు. చివరికి 26 ఓవర్ల మ్యాచ్(Cricket) గా నిర్వహించాలని నిర్ణయించడంతో భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే భారత్ మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించే సమయానికే 16.4 ఓవర్లు ఆడి కేవలం 57 పరుగులే చేసింది. దీంతో మిగిలిన 9.2 ఓవర్లలో కాస్త వేగంగా ఆడాల్సి వచ్చినా అనుకున్నంత స్కోర్ చేయలేకపోయింది.
కేఎల్ రాహుల్ 38, అక్షర్ పటేల్ 31 రన్స్ చేయడంతో స్కోర్ అతికష్టంమ్మీద 100 దాటింది. చివర్లో నితీశ్ రెడ్డి వేగంగా ఆడి 19 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఫలితంగా భారత్ 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మిఛెల్ ఓవెన్ , హ్యాజిల్ వుడ్, కున్హేమన్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఛేజింగ్ పెద్దది కాకపోవడంతో ఆస్ట్రేలియా స్వేఛ్ఛగా ఆడింది.
డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం 26 ఓవర్లలో 131 పరుగులే ఆసీస్ టార్గెట్ గా వచ్చింది. ఆరంభంలో ట్రావిస్ హెడ్, షార్ట్ వికెట్లు చేజార్చుకున్నప్పటకీ… మిఛెల్ మార్ష్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫిలిప్ , రెన్షాలతో కలిసి ఆసీస్ విజయాన్ని పూర్తి చేశాడు. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో కంగారూలు 21.1 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఆసీస్ 1-0 ఆదిక్యంలో నిలిచింది. సిరీస్ లో రెండో వన్డే అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23న జరుగుతుంది.