IND vs AUS 2nd ODI: సమం చేస్తారా…సమర్పిస్తారా.. ?

IND vs AUS 2nd ODI: కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పోరాడకుంటే తొలి వన్డేలో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేసుండేది కాదు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి కూడా పర్వాలేదనిపించాడు.

IND vs AUS 2nd ODI

ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా కీలకపోరుకు సిద్ధమైంది. సిరీస్(IND vs AUS) చేజారకుండా ఉండాలంటే అడిలైడ్ వేదికగా జరగబోయే రెండో వన్డేలో గెలిచి తీరాలి. తొలి వన్డేలో బ్యాటర్ల వైఫల్యంతో ఘోరపరాజయం పాలైన భారత్ కు ఈ(IND vs AUS) మ్యాచ్ డూ ఆర్ డైగా చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. లేకుంటే సిరీస్ చేజారిపోతుంది. భారీ అంచనాలతో ఈ పర్యటనకు వచ్చిన టీమిండియా తొలి వన్డేలో మాత్రం నిరాశపరిచింది.

చాలా రోజుల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. రోహిత్ 8 పరుగులకే ఔటవగా.. కోహ్లీ అసలు ఖాతానే తెరవలేదు. మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో శ్రేయాస్ అయ్యర్, గిల్ కూడా నిరాశపరిచారు.

కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పోరాడకుంటే తొలి వన్డేలో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేసుండేది కాదు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి కూడా పర్వాలేదనిపించాడు. కానీ ఓవరాల్ గా ఇండియా బ్యాటింగ్ మాత్రం స్థాయికి తగినట్టుగా లేదన్నది అంగీకరించాల్సిందే. బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయకుంటే బౌలర్లు మ్యాచ్ ను కాపాడే పరిస్థితి ఉండదన్నది అందరికీ తెలుసు.

పెర్త్ లో వర్షం కూడా భారత్ కు వ్యతిరేకంగా మారింది. చివరికి ఈ ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా ఇప్పుడు సిరీస్ సమమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో తుది జట్టుకు సంబంధించి మార్పులు జరిగే అవకాశముంది. గత మ్యాచ్ లో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఆడడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఫామ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ ను తీసుకోకపోవడంపై మాజీలు మండిపడ్డారు.

IND vs AUS 2nd ODI

దీంతో అడిలైడ్ వన్డేకు కుల్దీప్ ఆడిస్తారని భావిస్తున్నారు. దీంతో వాషింగ్టన్ సుందర్ పై వేటు పడనుంది. అటు పేస్ విభాగంలో సిరాజ్, అర్షదీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నారు. ఇక గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా పెద్దగా ప్రభావం చూపిందేమీ లేదు. దీంతో తుది జట్టులోకి హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ కృష్ణకు అవకాశమిస్తారా లేదా అనేది చూడాలి.

మరోవైపు సొంతగడ్డపై తమ పేస్ బలంతో ఎప్పటిలానే ఆస్ట్రేలియా దుమ్మురేపుతోంది. కమ్మిన్స్ లాంటి స్టార్ బౌలర్ లేకున్నా ఆసీస్ పేస్ పదును ఎక్కడా తగ్గలేదు. స్టార్క్, హ్యాజిల్ వుడ్ , నాథన్ ఎల్లిస్ తో బలమైన పేస్ ఎటాక్ ఉంది. ఇక స్పిన్నర్ గా ఆడమ్ జంపా రీఎంట్రీ ఇస్తున్నాడు. అడిలైడ్ లోనూ ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉండడంతో భారత బ్యాటర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు.

కాగా ఈ (IND vs AUS)మ్యాచ్ తోనైనా కోహ్లీ, రోహిత్ గాడిన పడతారేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తమ వన్డే ప్రపంచకప్ ఫ్యూచర్ ఈ సిరీస్ తోనే ఆధారపడి ఉండడంతో అడిలైడ్ లో వీరిద్దరూ చెలరేగాల్సిన పరిస్థితి నెలకొంది. అడిలైడ్ పిచ్ డ్రైగా ఉండి పేసర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం అక్కడ వర్షాలు కురుస్తున్నా మ్యాచ్ రోజు వర్షం ముప్పు లేదని తెలుస్తోంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version