Ind Vs Aus: వన్డే సిరీస్ లో బోణీ ఎవరిదో ?

Ind Vs Aus: సొంతగడ్డపై అత్యంత బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా(Ind Vs Aus)ను ఓడించడం భారత్ కు సవాలే. పైగా కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ సారథ్యంలో తొలిసారి బరిలోకి దిగుతోంది.

Ind Vs Aus

మొన్నటి వరకూ వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ చూసి బోర్ కొట్టిన క్రికెట్ ఫ్యాన్స్ కు మరో మూడు వారాలు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్… వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ జట్లుగా ఉన్న భారత్, ఆస్ట్రేలియా(Ind Vs Aus) వైట్ బాల్ సిరీస్ లలో తలపడబోతున్నాయి. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ ట్వంటీల సిరీస్ జరగబోతోంది. వన్డే సిరీస్ కు ఆదివారం నుంచే తెరలేవనుంది. పెర్త్ వేదికగా జరగనున్న ఈ (Ind Vs Aus) మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్ల ఆటగాళ్ళు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

సొంతగడ్డపై అత్యంత బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాను ఓడించడం భారత్ కు సవాలే. పైగా కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ సారథ్యంలో తొలిసారి బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ టూర్ లో తన కెప్టెన్సీతో ఆకట్టుకున్న గిల్ వన్డే ఫార్మాట్ లో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ టీమిండియాకు అతిపెద్ద బలంగా చెప్పొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా ఆడిన రోకో ద్వయం ఇప్పుడు మళ్ళీ టీమిండియా జెర్సీలో కనిపించబోతోంది.

Ind Vs Aus

ఆసీస్ అంటే చెలరేగిపోయే కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ఈ వన్డే సిరీస్ లో ఎలా ఆడతారనేది చూడాలి. అన్నింటికీ మించి వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కాలంటే ఈ సిరీస్ లో ఖచ్చితంగా రాణించాల్సిందే. మరోవైపు తుది జట్టు కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా పిచ్ లపై ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. దీంతో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల వ్యూహంతో భారత్ బరిలోకి దిగొచ్చు.

దీని ప్రకారం చూస్తే తుది జట్టులో మహ్మద్ సిరాజ్ పేస్ ఎటాక్ ను లీడ్ చేయనున్నాడు. అతనితో పాటు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ కృష్ణలో ఒకరికి చోటు ఖాయం. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ తో పాటు వాషింగ్టన్ సుందర్ లేదా కుల్దీప్ యాదవ్ లో ఒకరికి చోటు దక్కనుంది. ఇటీవల ఆసియాకప్ తో పాటు విండీస్ తో టెస్ట్ సిరీస్ లోనూ కుల్దీప్ అదరగొట్టాడు.

Ind Vs Aus

దీంతో కుల్దీప్ ను కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి. మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్ లో సంచలన మార్పులు ఏమీ చోటు చేసుకునే అవకాశం లేదు. ఓపెనర్లుగా రోహిత్ , గిల్ రానుండగా.. వన్ డౌన్ విరాట్ కోహ్లీ వస్తాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా కొనసాగనున్నాడు.

పాండ్యా దూరమడంతో సెలక్టర్ల పిలుపు అందుకున్న నితీశ్ రెడ్డి ఈ అవకాశాన్ని ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. మరోవైపు పలువురు కీలక ఆటగాళ్ళు గాయాలతో దూరమయ్యారు. అయినప్పటకీ కంగారూలను తేలిగ్గా తీసుకోలేం. ఇక గత రికార్డుల్లో మాత్రం భారత్ పై ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉంది.

Gold: ఆ కార్డుతో బంగారం సగం ధరకే కొనొచ్చనే వార్త ఎంత వరకు నిజం?నిపుణులు ఏమంటున్నారు?

Exit mobile version