Ind vs SA : భారత్ కు ఎదురుందా ?..సౌతాఫ్రికాతో సూపర్-8 పోరు

Ind vs SA : టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అంచనాలకు తగ్గట్టే గ్రూప్ స్జేజ్ ను పూర్తి చేసింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి అజేయంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సూపర్ 8 స్టేజ్ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాతో తలపడబోతోంది

Ind vs SA

టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అంచనాలకు తగ్గట్టే గ్రూప్ స్జేజ్ ను పూర్తి చేసింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి అజేయంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సూపర్ 8 స్టేజ్ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాతో(Ind vs SA) తలపడబోతోంది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరగబోతోంది.

ప్రస్తుతం భారత తుది జట్టు కూర్పుపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భారీ అంచనాలతో ఈ మెగాటోర్నీకి వచ్చిన అభిషేక్ శర్మ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ డకౌటయ్యాడు. దీంతో అభిషేక్ ను తప్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవడం..అదే సమయంలో సంజూ శాంసన్ కూడా ఫామ్ లో లేకపోవడంతో కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్నది ఆసక్తికరంగా మారింది. జట్టు వర్గాల సమాచారం ప్రకారం టోర్నీ మధ్యలో ప్రయోగాలు చేయడం కంటే అదే ఫైనల్ ఎలెవన్ ను కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కీలక మ్యాచ్ లో అభిషేక్ కు మరొక అవకాశం ఇస్తే ఫామ్ అందుకునే అవకాశముంది.

మరోవైపు నెట్ ప్రాక్టీస్ లో సంజూ శాంసన్ చాలా సీరియస్ గా ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయడంతో అతని రీఎంట్రీ ఇచ్చేందుకేనని వార్తలు వస్తున్నాయి. అటు మిడిల్ ఓవర్స్ లో స్పిన్ ఆడడంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ముఖ్యంగా తిలక్ వర్మ భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నాడు. దీంతో అతన్ని తప్పించి సంజూకు ఛాన్స్ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం లేదు. సూర్యకుమార్, దూబే, హార్థిక్ పాండ్యా మెరుపులు మెరిపిస్తే భారీస్కోరు ఖాయం.

Ind vs SA

మరోవైపు భారత్ బౌలింగ్ ఇంకా కొంచెం మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. వరుణ్ చక్రవర్తి మినహా మిగిలిన బౌలర్లు ఆకట్టుకోలేకపోతున్నారు. పైగా భారీగా పరుగులిచ్చేస్తున్నారు. దీంతో సౌతాఫ్రికా జట్టులో టాప్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే బౌలర్లు సమిష్టిగా రాణించాల్సిందే. పేసర్లు బుమ్రా, అర్షదీప్ సింగ్ లపై అంచనాలున్నాయి.

స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావడం ఖాయమైంది. హార్థిక్ పాండ్యా, దూబేలు కూడా బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో రాణిస్తున్నారు. మొత్తం మీద భారత తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇక దక్షిణాఫ్రికా కూడా గ్రూప్ స్టేజ్ లో అన్ని మ్యాచ్ లూ గెలిచే అజేయంగా సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ ఇప్పటి వరకూ నిలకడగా రాణించిన సౌతాఫ్రికాకు భారత్ తో మ్యాచ్ ఛాలెంజ్ కానుంది.

భారత్ పిచ్ లపై పూర్తి అవగాహన ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో భారీస్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version