Cricket
ప్రపంచ క్రికెట్(Cricket) లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ లకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ లా కాకుండా మైదానంలో జరిగే యుద్ధంలా భావిస్తుంటారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియాకప్ వంటి టోర్నీల్లోనే భారత్, పాక్ తలపడుతున్నాయి. ఇటీవల ఆసియాకప్ లో మూడుసార్లు తలపడితే మూడుసార్లూ భారత్ దే పైచేయిగా నిలిచింది. అదే సమయంలో నో షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర దుమారం రేపింది.
దీంతో అసలు పాక్ తో మ్యాచ్ లు వద్దే వద్దే అంటూ పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత్, పాకిస్థాన్ మధ్య మళ్ళీ క్రికెట్(Cricket) మ్యాచ్ జరగబోతోంది. వచ్చే ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ దాయాదుల క్రికెట్ సమరానికి వేదిక కాబోతోంది. ఇంకా అధికారిక షెడ్యూల్ రాకున్నప్పటకీ బోర్డు వర్గాల సమాచారం ప్రకారం భారత్, పాకిస్థాన్ ఫిబ్రవరి 15న తలపడనున్నాయి.
వచ్చే ప్రపంచకప్(Cricket) కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే భారత్ వచ్చేందుకు పాక్ నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కు శ్రీలంకలోని కొలంబో వేదిక కానుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు కేవలం తటస్థ వేదికలపైనే ఆడతాయి. అలాగే ఐసీసీ టోర్నీల్లో డ్రాలో మ్యాచ్ వస్తే మాత్రం ఖచ్చితంగా తలపడాల్సిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో పాక్ తో క్రికెట్ మ్యాచ్ లు ఆడడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పైగా ఆసియాకప్ గెలిచినా ట్రోఫీ ఇవ్వకుండా ఏసీసీ చీఫ్, పీసీబీ చీఫ్ గా ఉన్న నఖ్వీ ఓవరాక్షన్ చేశాడు. అప్పటి నుంచీ పాక్ తో అసలు మ్యాచ్ లు వద్దే వద్దంటూ వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తటస్థ వేదికల్లో ఆడుతోంది. దీనికి బీసీసీఐ కూడా అనుమతినిచ్చింది. ఇప్పుడు వచ్చే ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ లో లీగ్ స్టేజ్ లోనే భారత్, పాక్ తలపడబోతున్నాయి.
ఇక ఈ టోర్నీ తొలి మ్యాచ్ ను భారత్ యూఎస్ఏతో తలపడనుంది. ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరుగుతుందని తెలుస్తోంది. భారత్ లోని అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్ కత్తా, చెన్నై , ముంబైలను ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని దక్కించుకున్నాయి, పాక్ జట్టు తన మ్యాచ్ లన్నింటినీ శ్రీలంక వేదికగానే ఆడుతుంది. ఒకవేళ పాక్ సెమీస్ , ఫైనల్స్ కు వస్తే మాత్రం అవి కూడా తటస్థ వేదికపైనే జరుగుతుంది. అయితే ప్రపంచకప్ ఫైనల్ కు అహ్మదాబాద్ ఆతిథ్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
