T20 World Cup 2026
క్రికెట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ (T20 World Cup 2026)షెడ్యూల్ విడుదలైంది. భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ , లంక క్రికెటర్ మాథ్యూస్ ఐసీసీ ఛైర్మన్ జైషాతో కలిసి ముంబైలో షెడ్యూల్ విడుదల చేసారు. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండగా.. రెండు దేశాల్లోనూ కలిపి మొత్తం 8 వేదికల్లో మ్యాచ్ లు జరుగుతాయి.
భారత్లో ఢిల్లీ, కోల్ కత్తా, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, శ్రీలంకలో క్యాండీ, కొలంబోలోని ప్రేమదాస స్టేడియం, సింహల్సే స్పోర్ట్స్ క్లబ్ లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా నల్ జరుగుతుంది. అంతా ఊహించిట్టుగానే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో చోటు దక్కించుకున్నాయి. గ్రూప్ ఏలో భారత్,ప్రాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ , గ్రూప్ బిలో శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్, గ్రూప్ సిలో: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ , గ్రూప్ డిలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా ఉన్నాయి.
టోర్నీలో హైవోల్టేజ్ ఫైట్ గా భావిస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరుగుతుంది. భారత్ వచ్చేందుకు పాక్ నిరాకరించడంతో ఆ జట్టు ఆడబోయే మ్యాచ్ లన్నీ కొలంబోలోనే జరుగుతాయి. టోర్నీ ఆరంభమయ్యే రోజు ఫిబ్రవరి 7న మొత్తం 3 మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి. పాకిస్థాన్, నెదర్లాండ్స్ తొలి మ్యాచ్ లోనూ, వెస్టిండీస్, బంగ్లాదేశ్ రెండో మ్యాచ్ లోనూ , భారత్, యూఎస్ఏ మూడో మ్యాచ్ లోనూ తలపడనున్నాయి.
గత ఎడిషన్ తరహాలోనే ఈ సారి కూడా 20 జట్లు పోటీపడుతున్నాయి. నాలుగు గ్రూపుల్లో ఐడేసి జట్ల చొప్పున విభజించారు. ప్రతీ గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8కు క్వాలిఫై కానున్నాయి. సూపర్-8 స్టేజ్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనలకు అర్హత సాధిస్తాయి. పాకిస్థాన్ సెమీస్, ఫైనల్స్ కు చేరితే మాత్రం వేదిక కొలంబోకు మారే అవకాశముంది.
కాగా ఈ మెగా టోర్నీకి భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. 9 టీ ట్వంటీ ప్రపంచకప్ (T20 World Cup 2026) లు ఆడిన రోహిత్ ను మించిన ప్రచారకర్త ఈ మెగాటోర్నీకి ఉండడంటూ జైషా కొనియాడారు. మొత్తం 55 రోజుల పాటు జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నట్టు జైషా చెప్పారు.
టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026)లో భారత్ షెడ్యూల్:
- ఫిబ్రవరి 7 – భారత్ X యూఎస్ఎ (వేదిక: ముంబై )
- ఫిబ్రవరి 12 – భారత్ X నమీబియా (వేదిక ఢిల్లీ)
- ఫిబ్రవరి 15 – భారత్ X పాకిస్థాన్ (వేదిక: కొలంబో)
- ఫిబ్రవరి 18 – భారత్ X నెదర్లాండ్స్ (వేదిక: అహ్మదాబాద్)
