Kohli
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కోహ్లీని వచ్చే వారం నుంచి దేశవాళీ క్రికెట్ బరిలో చూడొచ్చు. డొమెస్టిక్ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం విరాట్ సన్నద్ధమవుతున్నాడు. దీని కోసం ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. గత కొంతకాలంగా ఫ్యామిలీతో కలిసి లండన్ లోనే ఉంటున్న కోహ్లీ)( Kohli భారత్ వన్డే సిరీస్ లు ఉన్నప్పుడు మాత్రం వచ్చి జట్టుతో కలుస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లోనూ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో దుమ్మురేపాడు.
మునుపటి కోహ్లీ( Kohli)ని గుర్తు చేస్తూ అదరగొట్టాడు. తర్వాత లండన్ వెళ్లిపోయిన విరాట్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ కోసం ఢిల్లీకి వచ్చి ప్రాక్టీస్ షురూ చేశాడు. ఇటీవల ప్రకటించిన ఢిల్లీ జట్టులో కోహ్లీ కూడా ఉన్నాడు. రిషబ్ పంత్ కెప్టెన్సీలో కింగ్ ఆడబోతున్నాడు. కాగా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందుబాటులో ఉన్నప్పుడు ప్రతీ ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవలే రూల్ తీసుకొచ్చింది. దీంతో కోహ్లీతో పాటు రోహిత్ శర్మ సైతం దేశవాళీ బరిలోకి దిగుతున్నారు.
ప్రస్తుతం కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. రోహిత్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. 2024 టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ ట్వంటీలకు, ఇటీవల ఇంగ్లాండ్ టూర్ కు ముందు టెస్టులకు రోకో జోడీ రిటైర్మెంట్ ఇచ్చింది. దేశవాళీ క్రికెట్ ఆడడంపై సీనియర్లతో గంభీర్ కు వాగ్వాదం జరిగినట్టు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ టైమ్ లోనే వార్తలు వచ్చాయి. సెలక్టర్ల జోక్యం కోహ్లీ విజయ్ హజారే ఆడేందుకు అంగీకరించగా.. హిట్ మ్యాన్ మాత్రం ఏదీ తేల్చలేదు. అటు ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా రోహిత్ అందుబాటులో ఉంటాడన్న సమాచారం తమకు రాలేదని చెబుతోంది.
కాగా విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి మొదలవుతోంది. కోహ్లీ చివరిగా 2010లో విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. దాదాపు 15 ఏళ్ళ తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలో దిగుతున్న కోహ్లీ ( Kohli)కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీకి సంబంధించి మ్యాచ్ లు బెంగళూరు బీసీసీఐ ఎక్సెలన్సీ గ్రౌండ్ లో జరుగుతాయని సమాచారం. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవల స్టార్ ప్లేయర్స్ దేశవాళీ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు పలువురు అభిమానులు గ్రౌండ్ లోకి వచ్చేస్తుండడంతో ప్లేయర్స్ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
