Kohli :ఆ విషాదంపై స్పందించిన కోహ్లీ..

Kohli :సరైన ప్లానింగ్ లేకుండా భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం, ప్రేక్షకుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం పెద్ద తప్పిదమని తేలింది.

Kohli

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) అభిమానులకు 2025 జూన్ 4 ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాల్సింది. ఎందుకంటే, ఆరోజునే RCB తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలిచింది. కానీ, ఆ సంతోషం క్షణాల్లోనే విషాదంగా మారింది. జట్టు విజయోత్సవ ర్యాలీ కోసం వేలాది మంది అభిమానులు గుమిగూడినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, జట్టు నాయకుడు విరాట్ కోహ్లీ మౌనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, దాదాపు రెండు నెలల తర్వాత, ఈ విషాదంపై కోహ్లీ(Kohli) స్పందించారు.

ఈ దుర్ఘటనపై జరిగిన అధికారిక విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. RCB మేనేజ్‌మెంట్, పోలీసులు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇతర నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ తొక్కిసలాటకు కారణమని తేలింది. సరైన ప్లానింగ్ లేకుండా భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం, ప్రేక్షకుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం పెద్ద తప్పిదమని తేలింది.

ఈ ఘటన జరిగినప్పుడు, RCB టైటిల్ సంబరాల్లో మునిగిపోయింది. కానీ, అదే సమయంలో 11 మంది అభిమానులు చనిపోయిన వార్త బయటకు రాగానే పరిస్థితి మారిపోయింది. నిజానికి ఈ ఘటనతో ప్రత్యక్షంగా టీమ్ తప్పు లేకపోయినా .. విరాట్ కోహ్లీ వెంటనే స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. #ArrestKohli అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండింగ్ అయ్యింది.

ముందుగా, RCB మేనేజ్‌మెంట్ మాత్రమే క్షమాపణలు చెప్పి, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించింది. RCB CARES అనే కార్యక్రమం కింద 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాతే కోహ్లీ (Kohli)తన బాధను పంచుకున్నట్లు తాజాగా ఆర్సీబీ ట్వీట్ చేసింది.

జూన్ 4 మా జట్టుకు ఒక సంతోషకరమైన రోజు కావాల్సింది, కానీ అది ఒక విషాద సంఘటనతో ముగిసింది. మీ బాధ మా కథలో భాగం. బాధిత కుటుంబాలకు నా ప్రార్థనలు అని కోహ్లీ (Kohli)తన సందేశంలో పేర్కొన్నారు. అంతేకాకుండా, బాధితులకు బాధ్యతగా అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. అప్పుడు వెంటనే స్పందించకపోవడంపై విమర్శలు వచ్చినా, చివరికి కోహ్లీ స్పందించడం మంచి పరిణామం అని కొందరు భావిస్తున్నారు.

Anushka: ఘాటితో కమ్ బ్యాక్: యాక్షన్ డోస్ పెంచిన జేజమ్మ.!

Exit mobile version