Just EntertainmentLatest News

Anushka: ఘాటితో కమ్ బ్యాక్: యాక్షన్ డోస్ పెంచిన జేజమ్మ.!

Anushka: ఘాటి మూవీలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జగపతి బాబు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 5న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

Anushka

అనుష్క శెట్టి(Anushka) అంటే గ్లామర్‌తో పాటు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కూడా! కానీ ఈ మధ్య సినిమాలకు ఆమె చాలా గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు ఆ గ్యాప్‌ని బ్రేక్ చేస్తూ ఘాటి మూవీ సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. రీసెంట్‌గా రానా దగ్గుబాటితో ఒక ఫ్రీవీలింగ్ కన్వర్సేషన్‌లో అనుష్క తన యాక్షన్ ఇమేజ్, లాంగ్ గ్యాప్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది

‘అరుంధతి’ నుంచి ‘ఘాటి’ వరకూ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీస్ అంటే డైరెక్టర్స్‌కి ఫస్ట్ ఆప్షన్ మీరే అని రానా అనగానే, అనుష్క నవ్వుతూ అలా ఎందుకు జరుగుతుందో నాకే తెలియడం లేదని చెప్పింది. తన సినిమాల్లోని యాక్షన్ గురించి అడగగా.. అరుంధతి, బాహుబలి.. ఇప్పుడు ఘాటిలో ఉన్న వయలెన్స్ చూస్తే, నేను ఒక హిట్‌మ్యాన్ లాగా హిట్‌వుమన్ అయిపోతానేమో అని క్రిష్‌తో అన్నానని ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. దానికి ఇలాంటి పవర్ఫుల్ రోల్స్‌కి మీరు తప్ప ఇంకెవరిని తీసుకుంటారని రానా సమాధానమిచ్చాడు

తన సినిమాల మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వస్తోందో కూడా అనుష్క(Anushka) క్లారిటీ ఇచ్చింది. నేను కచ్చితంగా ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని తరచుగా వర్క్ చేయాలని ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు నన్ను ఇంకా ఎక్కువ చూస్తారని ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చింది అనుష్క.

Anushka
Anushka

.డైరెక్టర్ క్రిష్‌తో తనకున్న ప్రత్యేక బంధం గురించి అనుష్క(Anushka) మాట్లాడుతూ, ఆయనే నాకు ఇలాంటి యూనిక్ క్యారెక్టర్స్ ఇస్తారు. సరోజలో నా రోల్‌ను చాలా ఇన్నోసెంట్‌గా హ్యాండిల్ చేశారు. అది నా బెస్ట్ రోల్స్‌లో ఒకటి. ‘ఘాటి’లో షీలా క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పింది. మొత్తానికి, ‘ఘాటి’ ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచింది. ఈ మూవీలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జగపతి బాబు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 5న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

Feed the Need:నిరుపయోగంగా ‘ఫీడ్ ది నీడ్’..ఏంటివి అనుకుంటున్నారా?

Related Articles

Back to top button