Blind Cricket Team:అంధుల క్రికెట్ జట్టుకు పవన్ కళ్యాణ్ సన్మానం..ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు!

Blind Cricket Team: క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంలో భాగంగా, పవన్ కళ్యాణ్..జట్టులోని ఒక్కో క్రికెటర్‌కు రూ. 5 లక్షల చొప్పున చెక్కులను అందించారు.

Blind Cricket Team

ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు (Blind Cricket Team)తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. దేశానికి గర్వకారణమైన ఈ మహిళా క్రీడాకారులను ఆయన ఘనంగా సన్మానించారు.

ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నందుకు ఆయన ఈ జట్టును మనస్ఫూర్తిగా అభినందించారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంలో భాగంగా, పవన్ కళ్యాణ్..జట్టు(Blind Cricket Team)లోని ఒక్కో క్రికెటర్‌కు రూ. 5 లక్షల చొప్పున చెక్కులను అందించారు. వారికి మార్గనిర్దేశం చేసిన కోచ్‌లకు రూ. 2 లక్షల చొప్పున చెక్కులు అందించారు.
అంతేకాకుండా, ప్రతి మహిళా క్రికెటర్‌ను పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి ఘనంగా సత్కరించారు.

Blind Cricket Team

సీఎంలందరికీ పవన్ విజ్ఞప్తి, గ్రామ సమస్యలపై తక్షణ ఆదేశాలు..ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణం అన్నారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు (CMs) స్వయంగా విజ్ఞప్తి చేస్తానని ప్రకటించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను తప్పకుండా ప్రోత్సహిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టు(Blind Cricket Team)లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

Blind Cricket Team

పవన్‌తో భేటీ సందర్భంగా, కెప్టెన్ దీపిక తమ గ్రామ సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, సంబంధిత అధికారులను పిలిచి, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారికి సంబంధించిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

అభినందనలు లేని చోట అండగా నిలబడిన నాయకుడు..ఈ మహిళా క్రికెటర్లు ప్రపంచ కప్‌ను గెలిచినప్పుడు, వారికి పెద్దగా ప్రశంసలు లేవు. ఇతర ప్రముఖుల నుంచి రివార్డులు, శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌లు కూడా పెద్దగా రాలేదు. గుర్తింపు లేని ఇలాంటి సమయంలో, పవన్ కళ్యాణ్ స్వయంగా వారిని కలిసి, ఘనంగా సన్మానించి, భారీ ప్రోత్సాహం అందించడం నిజంగా గొప్ప విషయం. అందుకే, ఆయన ఎప్పుడూ గ్రేట్ అని అభిమానులు భావిస్తారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version