Health Rule
ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిట్‌నెస్ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా 30-30-30 అనే రూల్(Health Rule) సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటు కఠినమైన డైటింగ్ చేయలేక, జిమ్‌లో గంటల తరబడి గడిపే టైమ్ లేక ఇబ్బంది పడే వారికి ఇది నిజంగానే వరమని చెప్పాలి. ఈ పద్ధతిని పాటించడం వల్ల శరీర మెటబాలిజం మారిపోయి, ఫ్యాట్ చాలా వేగంగా కరుగుతుంది.
ఈ నియమం ఎలా పాటించాలంటే.. ఉదయం నిద్రలేచాక.. మొబైల్ ఫోన్ వంటి వాటితో కాలక్షేపం చేయకుండా..కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఆ తర్వాత మొదటి 30 నిమిషాల్లోపు బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపులో మెటబాలిజం స్టార్ట్ అవుతుంది.
అయితే ఉదయపు ఆహారంలో కచ్చితంగా 30 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, పప్పు ధాన్యాలు, సోయా వంటివి బ్రేక్ ఫాస్టులో తీసుకోవచ్చు.ఇలా ప్రోటీన్ తీసుకోవడం వల్ల తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఎక్కువ సేపు ఆకలి వేయకపోవడంతో పాటు కండరాలు దృఢంగా మారుతాయి.
ఆహారం తీసుకున్న 15-20 నిమిషాలు తర్వాత.. ఒక అరగంట పాటు తేలికపాటి వ్యాయామం కానీ, చిన్న చిన్న ఎక్సర్‌సైజులు కానీ చేయాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా, శరీరం ఫిట్‌గా ఉంటుంది.
మామూలుగా తిన్న తర్వాత ఎక్సర్‌సైజులు చేయకూడదు అంటారు. కానీ ఈ ..30-30-30 హెల్త్ రూల్(Health Rule)లో …లో-ఇంటెన్సిటీ వ్యాయామాలు చేస్తారు. ఇక్కడ మీరు చెమటలు పట్టేలా పరిగెత్తరు. కేవలం నెమ్మదిగా నడవడం ,ఇంట్లోనే అటు ఇటు తిరగడం వంటివి చేస్తారు. హార్ట్ బీట్ నిమిషానికి 100 కంటే తక్కువగా ఉండేలా చూసుకుంటారు.
ఈ రూల్ వల్ల బాడీలో ఇన్సులిన్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి ఫ్యాట్‌ను కరిగించడానికి..ఈ రూల్ బాగా పనిచేస్తుంది. డైటింగ్ కంటే కూడా ఇది సులభంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆదరణ పెరుగుతోంది.
మనం 30 గ్రాముల ప్రోటీన్ తిన్న తర్వాత, శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం మొదలవుతాయి. ఆ సమయంలో నెమ్మదిగా నడవడం వల్ల ఆ గ్లూకోజ్ (Glucose) నేరుగా కండరాలకు శక్తిగా అందుతుంది. దీనివల్ల బ్లడ్‌లో షుగర్ ఒక్కసారిగా పెరగకుండా (Spike అవ్వకుండా) ఉంటుంది.
మీరు తిన్న వెంటనే ఇలాంటి తేలికపాటి ఎక్సర్‌సైజులు చేయడం వల్ల శరీరం ఆహారాన్ని కొవ్వుగా (Fat) మార్చి దాచుకోకుండా, వెంటనే దాన్ని వాడుకోవడం మొదలుపెడుతుంది. ఇది శరీరంలోని మెటబాలిజంను సెట్ చేయడానికి చేసే.. ఒక చిన్న బయో-హాక్ వంటిదని నిపుణులు చెబుతున్నారు .
