T20 World Cup : సౌతాఫ్రికాను వణికించిన ఆప్ఘనిస్థాన్..రెండో సూపర్ ఓవర్లో గట్టెక్కిన సఫారీలు

T20 World Cup :అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. అసలు గెలుపు మీద ఆశలేని ఆప్ఘనిస్థాన్ పోరాటంతో మ్యాచ్ టై కావడం.. తర్వాత ఒకటి కాదు రెండు సూపర్ ఓవర్లతో ఫలితం తేలడం అభిమానులకు మంచి కిక్కిచ్చింది

T20 World Cup

టీ ట్వంటీ ప్రపంచకప్(T20 World Cup) లో మరోసారి సంచలన కొద్దిలో మిస్సైపోయింది. అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. అసలు గెలుపు మీద ఆశలేని ఆప్ఘనిస్థాన్ పోరాటంతో మ్యాచ్ టై కావడం.. తర్వాత ఒకటి కాదు రెండు సూపర్ ఓవర్లతో ఫలితం తేలడం అభిమానులకు మంచి కిక్కిచ్చింది. ఈ మ్యాచ్ లో ఆప్ఘనిస్థాన్ పోరాటం, వారికి కౌంటర్ ఎటాక్ గా సౌతాఫ్రికా పోరాటం ఒకదానిని మించి మరొకటి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి.

మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. మాక్ర్ రమ్ నిరాశపరిచినా.. డికాక్, రికెల్టన్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. భారీ షాట్లతో రెచ్చిపోయారు. డికాక్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. అటు రికెల్టన్ విధ్వంసం మరో లెవెల్ లో సాగింది. ఆఫ్ఘన్ బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడిన ఈ సఫారీ బ్యాటర్ కేవలం 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. చివర్లో మిల్లర్, స్టబ్స్ కూడా భారీ షాట్లతో ధాటిగా ఆడడంతో సౌతాఫ్రికా స్కోరు 180 దాటింది.

భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఓపెనర్ గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. అయితే మరోవైపు వరుసగా వికెట్లు పడడంతో ఆఫ్ఘనిస్థాన్ గెలుపు కష్టంగా కనిపించింది. చివర్లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ విధ్వంసకర బ్యాటింగ్ తో అదరగొట్టారు.

T20 World Cup

రషీద్ ఖాన్ 20, నూర్ అహ్మద్ మెరుపులు మెరిపించారు. రబాడ రెండు నోబాల్స్ వేయడం కొంపముంచింది. మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ ను నిర్వహించారు. మొదటి సూపర్ ఓవర్లో ఆప్ఘనిస్థాన్ ధాటిగా ఆడి 17 పరుగులు చేసింది. ఛేజింగ్ లో సౌతాఫ్రికా కూడా అదే స్కోరు సాధించడంతో రెండో సూపర్ ఓవర్ ఆడక తప్పలేదు. ఈ సారి సౌతాఫ్రికా బ్యాటర్లు స్టబ్స్ , మిల్లర్ మరోసారి విధ్వంసం సృష్టించారు. భారీ షాట్లతో చెలరేగిపోయారు. ఫలితంగా రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా 23 పరుగులు చేసింది. రెండో సూపర్ ఓవర్లోనూ ఆఫ్ఘనిస్థాన్ విజయం కోసం చివరి వరకూ పోరాడింది. రెండో బంతికే నబీ ఔటైనప్పటకీ.. తర్వాత గుర్బాజ్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు.

దీంతో చివరి బంతికి సిక్స్ కొట్టాల్సి ఉండగా కేశవ్ మహారాజ్ వైడ్ వేశాడు. అయితే తర్వాత భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో గుర్బాజ్ క్యాచ్ ఇవ్వడంతో ఆప్ఘనిస్థాన్ విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సౌతాఫ్రికాకు ఇదే రెండో విజయం కాగా ఆప్ఘన్ జట్టుకు రెండో ఓటమి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version