AI Impact Summit:భారత్, ఫ్రాన్స్ AI బంధం.. ఢిల్లీ వేదికగా గ్లోబల్ సౌత్ సరికొత్త చరిత్ర సృష్టించబోతుందా?

AI Impact Summit: నైతిక విలువలతో కూడిన AIని తయారు చేయడానికి భారతదేశం, ఫ్రాన్స్ చేతులు కలిపాయి.

AI Impact Summit

ప్రపంచ రాజకీయాల్లోనే కాదు, టెక్నాలజీ రంగంలో కూడా ఫిబ్రవరి 2026 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యువల్ మాక్రోన్ ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటించబోతున్నారు. ఫిబ్రవరి 19-20 తేదీల్లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న ..AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026(AI Impact Summit) ఈ టూర్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య చర్చ కాదు.. అమెరికా, చైనాల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాల) తరపున భారత్ వినిపించబోయే గొంతుక అని చెప్పుకోవచ్చు..

అయితే భారత్-ఫ్రాన్స్ AI సదస్సు(AI Impact Summit) 2026..  కేవలం సదస్సు మాత్రమే కాదని ప్రపంచ గమనాన్ని మార్చే మహా వ్యూహం అని ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
అసలు ఈ సదస్సు ఎందుకు అనే ప్రశ్న వస్తే.. ప్రస్తుతం ప్రపంచ ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని అమెరికా (OpenAI, Google), చైనా (DeepSeek, Baidu) శాసిస్తున్నాయన్న సంగతి తెలిసిందే.

AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026(AI Impact Summit) కేవలం లాభాల కోసమో, ఆయా దేశ ప్రయోజనాల కోసమో పనిచేస్తున్నాయి. కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు (Global South) ఉపయోగపడేలా,అలాగే నైతిక విలువలతో కూడిన AIని తయారు చేయడానికి భారతదేశం, ఫ్రాన్స్ చేతులు కలిపాయి. చైనా వద్ద ఉన్న ‘రేర్ ఎర్త్ మినరల్స్’ అంటే చిప్స్ తయారీకి కావాల్సిన ఖనిజాల గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయడం కూడా దీని ప్రధాన లక్ష్యం అని తెలుస్తోంది.

AI generated image

దీని వల్ల భారతదేశానికి దాదాపు 10 బిలియన్ డాలర్ల ‘ఇండియా AI మిషన్’కు(AI Mission) ఫ్రాన్స్ టెక్నాలజీకి తోడవుతుంది. 2030 నాటికి భారత్ 500 బిలియన్ డాలర్ల AI మార్కెట్‌గా ఎదగడానికి ఇది పునాదిగా మారబోతోంది.
ఇక ఫ్రాన్స్‌ సంగతి చూసుకుంటే.. ఫ్రాన్స్‌కు చెందిన మిస్ట్రల్ AI వంటి బడా కంపెనీలకు.. 140 కోట్ల జనాభా ఉన్న భారతీయ మార్కెట్ దొరుకుతుంది. అలాగే ఏపీ, తెలంగాణలో ఉన్న ఖనిజ సంపద వారి సెమీకండక్టర్ ఇండస్ట్రీకి ప్రాణం పోస్తుంది.
ఇక సామాన్య ప్రజలకు దీని వల్ల ఉపయోగం ఏంటనే దానికి భాషిణి ప్రాజెక్ట్ సమాధానం చెబుతుంది. మన తెలుగువారు తెలుగులో ప్రశ్న అడిగితే, AI అది అర్థం చేసుకుని సమాధానమిస్తుంది. విద్యార్థులకు క్లిష్టమైన పాఠాలను తెలుగులో విడమర్చి చెబుతుంది. దీని వల్ల ఇప్పటి వరకూ ఉన్న భాషా అడ్డంకులు తొలగిపోతాయి.

ఈ సమ్మిట్ 7 కీలక రంగాల (7 Chakras) మీద ఫోకస్ చేస్తుంది.

హ్యూమన్ క్యాపిటల్.. దాదాపు 10 కోట్ల మంది ఉద్యోగులకు AI ట్రయినింగ్ ఇచ్చి, వారి స్కిల్‌ను పెంచడం.
ఇన్‌క్లూజన్..’భాషిణి’ ద్వారా తెలుగులోనే కాకుండా మరో 22 భారతీయ భాషల్లో AI సేవలు అందించడం.
సేఫ్ AI..టెక్నాలజీ వల్ల మనిషికి ఎలాంటి ముప్పు రాకుండా కఠినమైన రూల్స్ (Ethics) రూపొందించడం.
రెసిలెన్స్.. వాతావరణ మార్పులను, మెయిన్‌గా మన వర్షాలను (Monsoon) కచ్చితంగా అంచనా వేసేలా AIని వాడేలా చూడటం.
సైన్స్.. గ్లోబల్ సౌత్ దేశాల్లో శాస్త్రీయ పరిశోధనలకు నిధులు కేటాయించడం.
డెమోక్రటైజేషన్.. కేవలం ధనవంతులకే కాకుండా, పేద దేశాలకు కూడా డేటాతో పాటు కంప్యూటింగ్ పవర్ అందేలా చూడటం.
ఎకనామిక్ గ్రోత్.. ఆరోగ్యం, వ్యవసాయం,తయారీ రంగాల్లో AI ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం.

AI ఇంపాక్ట్ సమ్మిట్(AI Impact Summit) వల్ల డాక్టర్ రెడ్డీస్ వంటి ఫార్మా కంపెనీలతో కలిసి AI ద్వారా తక్కువ ధరకే కొత్త మందుల ఆవిష్కరణ జరుగుతుంది. మన తెలుగు స్టార్టప్‌లకు ఫ్రెంచ్ కంపెనీల నుంచి భారీగా నిధులు (Funding) అందుతాయి.

AI generated image

ఇక తెలంగాణ, ఏపీలలో సుమారు 5 లక్షల మందికి AI రిలేటెడ్ జాబ్స్ వచ్చే అవకాశముంటుంది. పత్తి రైతులకు,వరి రైతులకు ‘ప్రిసిషన్ ఫార్మింగ్’ ద్వారా ఏ సమయంలో నీరు పెట్టాలి, ఎప్పుడు మందులు జల్లాలి అనేది ఇకపై ఈ AI సూచిస్తుంది.

అయితే దీనిపై డేటా ప్రైవసీ విషయంలో ఐరోపా దేశాల (GDPR) చట్టాలకు, భారత్ చట్టాలకు మధ్య సమతుల్యత ఎలా కుదురుతుందో చూడాలి. అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చే ‘ప్రొటెక్షనిజం’ అంటే తమ దేశానికే ప్రాధాన్యత విధానాలను భారత్ ఎలా ఎదుర్కొంటుందో కూడా చూడాల్సిందే.

మొత్తంగా మాక్రోన్ పర్యటన కేవలం ఒక విదేశీ నేత రాక కాదు.. అది భారతదేశ భవిష్యత్తును మార్చే ఒక ‘టెక్ డిక్లరేషన్ అని చెప్పొచ్చు. ఈ ఒప్పందాల వల్ల రాబోయే ఐదేళ్లలో ఇండియన్స్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడం గ్యారంటీ.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version