Vaibhav Sooryavanshi
గత ఏడాది కాలంగా ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఆడుతున్న ప్రతీ మ్యాచ్ లోనూ దుమ్మురేపుతున్న వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi ) కొత్త సంవత్సరంలోనూ చెలరేగిపోతున్నాడు. క్రీజులోకి అడుగుపెట్టడమే తరువాయి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆడుతున్నది స్వదేశంలోనూ, విదేశాల్లోనూ అనేది కూడా అనవసరం… భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. గత ఏడాది ఐపీఎల్ నుంచి మనోడి రికార్డుల మోత మొదలైంది. అరంగేట్రంలోనే ఐపీఎల్ లో శతక్కొట్టాడు.
తర్వాత ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ లోనూ దుమ్మురేపేశాడు. ఆ వెంటనే అండర్ 19 ఆసియాకప్ లో సైతం విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు అండర్ 19 ప్రపంచకప్ కు ముందు సన్నాహకంగా జరుగుతున్న సిరీస్ లో సౌతాఫ్రికాపై కూడా రెచ్చిపోయాడు. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ మూడో వన్డేలోనూ భారీస్కోర్ చేసింది. దీనిలో వైభవ్ సూర్యవంశీదే కీ రోల్. అద్భుత సెంచరీతో దుమ్మురేపాడు. కేవలం 63 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ క్రమంలో పలు ప్రపంచ రికార్డులు అందుకున్నాడు.
యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయస్సులో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ఆయుశ్ మాత్రే గాయంతో దూరమైన నేపథ్యంలో ఈ సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా వైభవ్ ను నియమించారు. మొత్తం 74 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 127 పరుగులు చేశాడు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ తో కలిసి వైభవ్ ( Vaibhav Sooryavanshi )తొలి వికెట్‌కు నమోదైన 227 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ తొలి వన్డేలో 11 రన్స్ కే ఔటైనా రెండో మ్యాచ్ లో 68 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. ఈ సిరీస్‌కు ముందు బిహార్ తరఫున విజయ్ హజారే ట్రోఫీలోనూ 190 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
తాజా ప్రదర్శనతో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ రికార్డుకు చేరువలో నిలిచాడు. అండర్ 19 వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీని దాటేందుకు కేవలం 5 పరుగుల దూరంలో నిలిచాడు. కోహ్లీ అండర్ 10 వన్డేల్లో 28 మ్యాచ్ లు ఆడి 46కు పైగా సగటుతో 978 పరుగులు చేస్తే.. వైభవ్ ( Vaibhav Sooryavanshi )18 మ్యాచ్ లలోనే 57కు పైగా సగటుతో 973 పరుగులు సాధించాడు.
విశేషమేమిటంటే వైభవ్ సగటు కోహ్లీ కంటే మెరుగ్గా ఉంది. ఈ జాబితాలో విజయ్ జోల్ టాప్ ప్లేస్ లో ఉండగా.. ఉండగా, యశస్వి జైస్వాల్, తన్మయ్ శ్రీవాస్తవ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Shreyas Iyer: శ్రేయాస్ హిట్..గిల్ ఫ్లాప్… విజయ్ హజారే ట్రోఫీ రౌండప్
