Just SportsLatest News

Shreyas Iyer: శ్రేయాస్ హిట్..గిల్ ఫ్లాప్… విజయ్ హజారే ట్రోఫీ రౌండప్

Shreyas Iyer : గాయం తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేశాడు

Shreyas Iyer

దేశవాళీ క్రికెట్ టోర్నీ చాలా రోజుల తర్వాత స్టార్ ప్లేయర్స్ తో కళకళలాడుతోంది. ఫస్ట్ రౌండ్ లో కోహ్లీ, రోహిత్ శర్మ సందడి చేస్తే.. ఈ వారం చాలా మంది భారత క్రికెటర్లు బరిలోకి దిగారు. అయితే అందరి దృష్టీ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer), శుభమన్ గిల్ పైనే నిలిచింది. గాయాల కారణంగా ఆటకు దూరమైన చాలారోజుల తర్వాత గ్రౌండ్ లో అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్ దుమ్మురేపాడు. జైపూర్ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ముంబై జట్టుకు సారథ్యం వహించాడు. నాలుగో ప్లేస్ లో బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ టీ20 తరహాలో హిట్టింగ్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 53 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 రన్స్ చేశాడు. మరింత దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చాడు.

Shreyas Iyer
Shreyas Iyer

దీంతో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 33 ఓవర్లకు కుదించగా.. ముంబై 299 పరుగుల భారీస్కోర్ సాధించింది. మరో బ్యాటర్ ముషీర్ ఖాన్ కూాడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ టూర్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)ఐసీయూలో చికిత్స తీసుకుని బయటపడ్డాడు. గత కొంతకాలంగా విశ్రాంతికే పరిమితమై ఇటీవలే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. కివీస్ తో వన్డే సిరీస్ కు ఎంపికైనప్పటకీ ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే క్లియరెన్స్ ఇస్తామని సీవోఈ తెలిపింది. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన శ్రేయాస్ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆడాడు.

మరోవైపు భారత కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం ఫ్లాప్ అయ్యాడు. గోవాతో మ్యాచ్ లో బరిలోకి దిగిన గిల్ నిరాశపరిచాడు. 12 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులకే వెనుదిరిగాడు. చివరిసారిగా ఆసీస్ టూర్ లో ఆడిన గిల్ మెడనొప్పితో సౌతాఫ్రికా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. పేలవ ఫామ్ తో టీ20 ప్రపంచకప్ లో గిల్ కు చోటు దక్కలేదు. ఇప్పుడు కివీస్ తో వన్డే సిరీస్ కు రీఎంట్రీ ఇచ్చినా ఫెయిలవడం నిరాశకు గురి చేసింది.

Camphor:దేవుడికిచ్చే హారతి కర్పూరం వెనుకున్న అసలు సైన్స్ ఇదే..ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button