iPhone 17: ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్..లాంచ్‌కు ముందే ధరలు లీక్!

iPhone 17 :సెప్టెంబర్ 9న జరగనున్న "అవే డ్రాపింగ్" ఈవెంట్‌లో ఈ సరికొత్త సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు యాపిల్ ప్రకటించింది.

iPhone 17

ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 17 (iPhone 17)సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. సెప్టెంబర్ 9న జరగనున్న “అవే డ్రాపింగ్” ఈవెంట్‌లో ఈ సరికొత్త సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు యాపిల్ ప్రకటించింది. అయితే, అధికారిక లాంచ్‌కు ముందే ఈ కొత్త ఐఫోన్ల ధరలు, సేల్ తేదీలు ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఐఫోన్ లవర్స్‌ను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.

ఐఫోన్ 17 (iPhone 17)సిరీస్‌లో నాలుగు కొత్త మోడల్స్

ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఇలా మొత్తం నాలుగు కొత్త మోడల్స్ రానున్నాయి. గత మోడల్స్‌తో పోలిస్తే, ఈ కొత్త సిరీస్ ధరలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లీక్ అయిన సమాచారం ప్రకారం, వీటి ధరలు గత మోడల్స్‌ కంటే సుమారు $50 (దాదాపు రూ.4,000) ఎక్కువగా ఉండొచ్చు.

iPhone 17

అంచనా ధరల వివరాలు (లీక్ ఆధారంగా):

ఐఫోన్ 17: రూ. 84,900 నుంచి
ఐఫోన్ 17 ఎయిర్: రూ. 1,09,900 నుంచి
ఐఫోన్ 17 ప్రో: రూ.1,24,900 నుంచి
ఐఫోన్ 17 ప్రో మాక్స్: రూ. 1,64,900 నుంచి

లాంచ్, సేల్ తేదీలు..యాపిల్ “అవే డ్రాపింగ్” ఈవెంట్ సెప్టెంబర్ 9న రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌ను యాపిల్ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌లలో లైవ్ చూడొచ్చు. ఐఫోన్‌లతో పాటు కొత్త యాపిల్ వాచ్, వాచ్ అల్ట్రా, iOS 26 కూడా విడుదల కానున్నట్లు సమాచారం.

సేల్ విషయానికి వస్తే, ఐఫోన్ 17(iPhone 17) సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12న ప్రారంభమవుతాయి. అధికారిక సేల్ మాత్రం సెప్టెంబర్ 19న మొదలవుతుందని భావిస్తున్నారు. ఈసారి కూడా యాపిల్ గత ఏడాది షెడ్యూల్‌నే అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కొత్త సిరీస్‌లో మెరుగైన స్టోరేజీ, వేగవంతమైన ప్రాసెసర్, అప్‌గ్రేడ్ అయిన కెమెరా సామర్థ్యాలు ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త ఐఫోన్‌ల కోసం వేచి చూస్తున్నవారికి ఈ లీక్‌లు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

Vande Bharat: వందే భారత్ రైలులో ఇకపై పడుకొనే ప్రయాణించొచ్చు.. ఈనెలలోనే ప్రారంభం

Exit mobile version