Free WiFi: ఉచిత వైఫై వాడుతున్నారా? డేటా లీక్‌పై నిపుణుల హెచ్చరిక!

Free WiFi:ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లు హ్యాకర్లకు ఒక ఈజీ టార్గెట్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Free WiFi

ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మాల్స్ వంటి అనేక పబ్లిక్ ప్రదేశాల్లో ఉచిత వైఫై(Free WiFi) సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు చాలా సౌకర్యవంతంగా అనిపించినా, వాటిని ఉపయోగించేటప్పుడు సైబర్ భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లు హ్యాకర్లకు ఒక ఈజీ టార్గెట్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఉచిత వైఫై (Free WiFi)నెట్‌వర్క్‌లు సురక్షితమైనవి కావు. హ్యాకర్లు ఈ నెట్‌వర్క్‌లలోకి సులభంగా ప్రవేశించి, మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించగలరు. ముఖ్యంగా, మీరు బ్యాంకింగ్ లావాదేవీలు చేస్తే మీ పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

మానవ-మధ్య-దాడి (Man-in-the-Middle Attack)..హ్యాకర్లు ఉచిత వైఫైకి కనెక్ట్ అయినప్పుడు, వారు మీ ఫోన్ లేదా కంప్యూటర్ మధ్యలో ఉండి, మీ డేటాను దొంగిలించగలరు. మీరు వెబ్‌సైట్లు చూస్తున్నప్పుడు వారు తప్పుడు వెబ్‌సైట్లకు మిమ్మల్ని మళ్లించగలరు.

Free WiFi

మాల్‌వేర్ ఇన్‌స్టాలేషన్: కొన్ని సందర్భాల్లో, హ్యాకర్లు మీ ఫోన్‌లో మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయగలరు. దీంతో మీ డేటా మొత్తం ప్రమాదంలో పడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

విశ్వసనీయ నెట్‌వర్క్‌లను మాత్రమే వాడాలి. మీకు నమ్మకం ఉన్న నెట్‌వర్క్‌లను మాత్రమే వాడాలి. బ్యాంకింగ్, షాపింగ్ లావాదేవీలు ఉచిత వైఫైలో చేయకూడదు. వి.పి.ఎన్ (VPN)ఉపయోగించడం వల్ల మీ డేటా సురక్షితంగా ఉంటుంది.

ఆటో-కనెక్ట్ ఆఫ్ చేయాలి. మీ ఫోన్ సెట్టింగ్స్‌లో ‘ఆటో-కనెక్ట్’ ఫీచర్‌ను ఆఫ్ చేయాలి.వీలైనంత వరకు పబ్లిక్ వైఫైని వాడటం తగ్గించాలి.ఉచిత వైఫై సౌకర్యవంతంగా ఉన్నాకూడా మీ వ్యక్తిగత సమాచారం రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోవాలి..

Gen-Z : ఏంటీ జెన్ -Z పోరాటం? నేపాల్‌లో హాష్‌ట్యాగ్‌లతో మొదలై ఉద్యమంగా ఎలా మారింది?

Exit mobile version