Gold Price : బంగారం కొనడమా.. అమ్మడమా..ఏది బెటర్ ?

Gold Price : ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం కొనే పరిస్థితి లేనట్టే.. అందుకే డబ్బులు ఉంటే ఇప్పుడు కొనుక్కోవడం మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది

Gold Price

గత కొన్ని నెలలుగా బంగారం ధరలు(Gold Price) చిరుత కంటే వేగంగా పరిగెడుతున్నాయి. అసలు ఏమాత్రం అడ్డూ అదుపూ లేకుండా దూసుకుపోతున్నాయి. సామాన్యులకే కాదు సంపన్నులకు సైతం ఈ గోల్డ్ రష్ షాకిస్తోంది. ఇప్పటికే లక్షన్నర దాటిపోయింది. ఈ ఏడాది చివరికల్లా 10 గ్రాముల ధర రూ.2 లక్షలకు చేరిపోతుందన్న అంచనాలున్నాయి.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం కొనే పరిస్థితి లేనట్టే.. అందుకే డబ్బులు ఉంటే ఇప్పుడు కొనుక్కోవడం మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే నెలల వ్యవధిలో బంగారం ధర రూ.1.60 లక్షలను దాటేసింది. అటు వెండి సంగతి కూడా అంతే. ప్రస్తుతం రూ.3.6 లక్షలకు చేరిపోయింది. సరిగ్గా గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 79 శాతం పెరిగింది.

వ్యక్తిగత వినియోగ అవసరాలకు తోడు రిటైల్‌ ఇన్వెస్టర్లు, సంపన్నులు సైతం బంగారంవైపు చూస్తుండటం పసిడి ధరలకు సహజంగానే రెక్కలు వచ్చేస్తున్నాయి. దీంతో కొత్తగా కొనాలనుకున్న వారి పరిస్థితేంటనేది అర్థం కావడం లేదు. అదే సమయంలో ఇళ్లలో కిలోలకు కిలోలు వెండి ఉన్నవారు దాన్ని విక్రయిస్తే మంచిదా వంటి వాటిపై చర్చ మొదలైంది. అటు సిప్‌ రూపంలో బంగారంపై పెట్టుబడి పెడితేనే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. గరిష్ట ధరల వద్ద ఒకేసారి పెట్టుబడి పెట్టడం కాకుండా నెలవారీ నిర్ణీత మొత్తాన్ని గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Gold Price

అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరల పరిస్థితి చూసి హడావిడిగా పెట్టుబడులు పెట్టేయాల్సిన పనిలేదు. ఉన్నట్టుండి వీటి ధరలు గణనీయంగా పెరగడంతో పాటు వీటిల్లో హెచ్చుతగ్గులు కూడా అదే విధంగా ఉండొచ్చు. నిజానికి తక్కువకాలంలో వీటికి డిమాండ్ పెరిగినప్పుడు దాని ధరను అంచనా వేయడం కొంచెం కష్టమే. వీటి డిమాండ్, ధరల తీరును కచ్చితంగా అంచనా వేయడం కష్టం. దీర్ఘకాలంలో మాత్రం బంగారం, వెండిపై పెట్టుబడి అంటే తిరుగుండదు. ఇప్పటికే బంగారం కొనుగోలు చేసిన వారు గరిష్ట ధరల దగ్గర విక్రయించి లాభం పొందాలనుకుంటే అమ్మేసుకోవచ్చు.

అయితే జీఎస్‌టీ చార్జీలు, తరుగు రూపంలో లాభంలో కొంత నష్టపోవాల్సి ఉంటుంది. ఒక బంగారం ధరలు చేరినట్టయితే విక్రయించడం మంచి ఆలోచనేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Eat:ఏం తింటున్నామన్నది కాదు..ఎప్పుడు తింటున్నామన్నదే ముఖ్యం.. ఎందుకో తెలుసా?

Exit mobile version