AI scams: మీ సన్నిహితుల గొంతుతోనే ఫోన్.. ఏఐ స్కామ్స్ నుంచి తస్మాత్ జాగ్రత్త

AI scams: మీ కుటుంబ సభ్యుల గొంతుతోనే మీకు ఫోన్ చేసి డబ్బులు అడిగితే మీరు నిజమే అని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది

AI scams

టెక్నాలజీ ఎంత పెరుగుతుందో స్కామ్స్(AI scams) కూడా అంతే పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2025లో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాయిస్ క్లోనింగ్ ద్వారా స్కామర్లు ప్రజలను మోసం చేస్తున్నారు.

మీ కుటుంబ సభ్యుల గొంతుతోనే మీకు ఫోన్ చేసి డబ్బులు అడిగితే మీరు నిజమే అని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలో కొంచెం అవేర్‌నెస్ పెంచుకోవాలని అంటున్నారు నిపుణులు.

అసలు ఏఐ వాయిస్ క్లోనింగ్ అంటే ఏంటంటే..స్కామర్లు సోషల్ మీడియాలో ఉన్న మీ వీడియోల నుంచి మీ గొంతును సేకరించి ఏఐ సాఫ్ట్‌వేర్ ద్వారా దాన్ని కాపీ చేస్తారు. ఆ తర్వాత మీ బంధువులకు ఫోన్ చేసి నేను ఆపదలో ఉన్నాను వెంటనే డబ్బులు పంపండి అని మీ గొంతుతోనే అడుగుతారు. అవతలి వారికి అది మీ గొంతు లాగే అనిపించడం వల్ల వెంటనే డబ్బులు పంపేస్తారు.

AI scams

స్కామ్ (AI scams)కాల్ అని ఎలా గుర్తుపట్టాలి..ఎంతటి సన్నిహితుల గొంతు వినిపించినా డబ్బులు అడిగినప్పుడు ఒక్క నిమిషం ఆగండి. అత్యవసరం అని వారు ఒత్తిడి తెస్తున్నారంటే అది స్కామ్ అయ్యే అవకాశం ఎక్కువ.

సీక్రెట్ కోడ్ మీ కుటుంబ సభ్యులతో ఒక సీక్రెట్ వర్డ్ లేదా కోడ్ పెట్టుకోండి. నిజంగా ఆపదలో ఉన్నప్పుడు ఆ కోడ్ చెబితేనే నమ్మండి. తిరిగి కాల్ చేయండి వారు చేసిన నంబర్‌కు కాకుండా మీరు సేవ్ చేసుకున్న వారి ఒరిజినల్ నంబర్‌కు మళ్లీ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి.

సోషల్ మీడియాలో మీ ఫోన్ నంబర్లు ,వ్యక్తిగత వివరాలను పబ్లిక్‌గా ఉంచకండి. గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయకండి. అనుమానిత కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version