Google: గూగుల్ లో ఏఐ కొత్త ఫీచర్ త్వరలో ఇండియాలోనూ ఎంట్రీ

Google: గూగుల్ గతంలో తీసుకొచ్చిన ఏఐ ఓవర్ వ్యూస్ ఫీచర్ బాగా హిట్టయింది. దాదాపు 200కు పైగా దేశాల్లో, 40 కంటే ఎక్కువ భాషల్లో 200 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉపయోగించారని గూగుల్ చెబుతోంది.

Google

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కు పెరుగుతున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.. రానున్న రోజుల్లో భవిష్యత్తు అంతా ఏఐదే.. ఇప్పటికే చాలా దేశాల్లో ఏఐ వాడకం పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google) కూడా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా గూగుల్ సెర్చ్ లో కొత్త ఏఐ ఫీచర్స్ ను తీసుకొస్తోంది. సెర్చ్ లైవ్, ఏఐ మోడల్ ను భారత్ లో ప్రవేశపెట్టబోతోంది. ఈ రెండు ఫీచర్స్ తో పాటు మరికొన్నింటిని కూడా చేర్చనుంది. సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్ కూడా అప్ గ్రేడ్ కానుంది.

ఈ కొత్త ఫీచర్స్ కారణంగా సెర్చ్ మరింత ఫాస్ట్ గా, ఈజీగా పనిచేస్తుందని గూగుల్(Google) తెలిపింది. సెర్చ్ లైవ్ ఫీచర్ ద్వారా వినియోగదారులు డైరెక్ట్ గా గూగుల్ తో మాట్లాడే సౌకర్యం ఉంటుంది. వినియోగదారులు నేరుగా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆన్సర్స్ ఇస్తుంది. ఈ సెర్చ్ లైవ్ ప్రస్తుతం ఉన్న జెమిని లైవ్ ఫీచర్ తరహాలోనే వర్క్ చేస్తుందని వెల్లడించాయి. ఈ ఫీచర్ తో ఫోన్ కెమెరా, వాయిస్ కన్వర్జేషన్ మోడ్ ను ఉపయోగించి గూగుల్ తో మాట్లాడే సౌలభ్యం ఉంది. సెర్చ్ ఆప్షన్ మరింత ఈజీగా ఉండేందుకే దీనిని తీసుకొస్తున్నట్టు గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.

Google

ఇదిలా ఉంటే గూగుల్(Google) పిక్సెల్ ఫోన్లలో బాగా క్రేజ్ ఉన్న సర్కిల్ టు సెర్చ్ ఫీచర్‌ను
ఇకపై ఏఐ మోడ్‌తో లింకప్ చేయబోతున్నారు. దీని ద్వారా ఒక వస్తువు సర్కిల్ చేస్తే అది ఏంటనే విషయంతో పాటు మనకు దగ్గరలో ఎక్కడ దొరుకుతుందనేది చెబుతుంది. కానీ మరింత లోతుగా దీనిని ఉపయోగించుకోవాలంటే మాత్రం గూగుల్ ఏఐ ప్రోకు సబ్ర్ స్క్రైబ్ చేసుకోవాల్సిందే.

మరోవైపు గూగుల్ గతంలో తీసుకొచ్చిన ఏఐ ఓవర్ వ్యూస్ ఫీచర్ బాగా హిట్టయింది. దాదాపు 200కు పైగా దేశాల్లో, 40 కంటే ఎక్కువ భాషల్లో 200 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉపయోగించారని గూగుల్ చెబుతోంది. ఏఐ ఓవర్‌వ్యూలను చూపించే సెర్చ్ ప్రశ్నల సంఖ్య కూడా పది శాతం పెరిగిందని తెలిపింది. భారత్ లో 10 కోట్ల మందికి ఈ ఫీచర్ చేరిందని వెల్లడించింది. అటు విజువల్ సెర్చ్ కూడా గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో ఇకపై వాయిస్, విజువల్స్ కోసం ఏఐ ఫీచర్ కీలకం కాబోతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version