Bengaluru :ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్‌లో బెంగళూరు ట్రాఫిక్ .. హైదరాబాద్‌ పరిస్థితి ఏంటి?

Bengaluru : తాజాగా విడుదలైన టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2025 నివేదిక బెంగళూరు వాసులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది.

Bengaluru

ఒకప్పుడు ప్రయాణం అంటే ఎంజాయ్ చేస్తూ కాస్త రిలీఫ్‌గా ఫీలయ్యేవారు. కానీ ఇప్పుడు రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంలోనే తాజాగా విడుదలైన టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2025 నివేదిక బెంగళూరు వాసులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల్లో మెక్సికో సిటీ తర్వాత బెంగళూరు(Bengaluru ) రెండో స్థానంలో నిలిచి షాక్ ఇచ్చింది. అక్కడ కేవలం పది కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి దాదాపు 36 నిమిషాల 9 సెకన్ల సమయం పడుతోంది. ఇక సాయంత్రం రష్ అవర్‌లో అయితే అది సగటున 45 నిమిషాలకు పైగా దాటుతోంది. దీనిని బట్టి ఒక బెంగళూరు వాసి సంవత్సరానికి దాదాపు 168 గంటల కాలాన్ని కేవలం ట్రాఫిక్‌లోనే వృథా చేస్తున్నారు. దీంతో బెంగళూరులో ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 47వ ర్యాంకులో ఉండగా, ఆసియాలో 15వ స్థానంలో ఉంది. బెంగళూరు (Bengaluru)తో పోలిస్తే ఇక్కడి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా, ఇది వార్నింగ్ బెల్‌గానే భావించాలి. హైదరాబాద్‌లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 18 నిమిషాలు పడుతోంది.

గతేడాది కంటే రద్దీలో 1.3 శాతం మెరుగుదల కనిపించడం విశేషం. దీనికి ప్రధాన కారణం మెట్రో రైలు సేవలు, ఎంఎంటీఎస్ విస్తరణ,ఔటర్ రింగ్ రోడ్ (ORR) సదుపాయం. కానీ, ఐటీ రంగం శరవేగంగా విస్తరిస్తున్న గచ్చిబౌలి, హైటెక్ సిటీ , మాదాపూర్ వంటి ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో వెహికల్ వేగం గంటకు కేవలం 15.6 కిలోమీటర్లకు పడిపోవడం ఆందోళన కలిగించే విషయం.

హైదరాబాద్ మరో బెంగళూరు కాకుండా ఉండాలంటే ప్రభుత్వం , ప్రజలు తక్షణమే మేల్కోవాలి. బెంగళూరు(Bengaluru ) లో ఒక కోటికి పైగా ప్రైవేట్ వాహనాలు ఉండగా, ప్రజా రవాణా వాటా కేవలం ఒక శాతమే ఉంది. హైదరాబాద్‌లో కూడా ప్రతిరోజూ 1500 కొత్త వాహనాలు రోడ్ల మీదకు వస్తున్నాయి. భవిష్యత్తులో గాలిలో తేలే ఫ్లైఓవర్లు ఎన్ని కట్టినా, ప్రైవేట్ వాహనాల సంఖ్య తగ్గకపోతే మాత్రం ట్రాఫిక్ చిక్కులు తప్పవు.

అందుకే మెట్రో ఫేజ్-2 పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు అలాగే ఓఆర్ఆర్ చుట్టూ అనుసంధానతను పెంచాలి. అలాగే కనీసం 5,000 ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చి, మధ్యతరగతి ప్రజలు తమ సొంత కార్లను వదిలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎంచుకునేలా చేయాలి.

కేవలం రోడ్ల విస్తరణే కాకుండా, టెక్నాలజీని కూడా మనం వాడుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం ద్వారా.. రద్దీని బట్టి ఆటోమేటిక్‌గా సిగ్నల్ సమయాన్ని మార్చొచ్చు. దీనివల్ల ప్రయాణ సమయం 15 నుంచి 20 నిమిషాల వరకు తగ్గే అవకాశం ఉంది.

అలాగే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఫ్లెక్సిబుల్ పని వేళలను కల్పిస్తే, రోడ్లపై ఒత్తిడి తగ్గుతుంది. వాహనాల సంఖ్యను నియంత్రించడానికి ఢిల్లీ తరహాలో ఆడ్-ఈవెన్ పద్ధతిని అమలు చేయడంతో పాటు పార్కింగ్ ఫీజులను రద్దీని బట్టి మార్చడం వంటి కఠిన నిర్ణయాలు కూడా భవిష్యత్తులో అవసరం కావొచ్చు.

Bengaluru

­

లాంగ్ టర్మ్ ప్లానింగ్‌లో భాగంగా ..హైదరాబాద్ చుట్టూ స్మార్ట్ సిటీలను డెవలప్ చేయాలి. అన్ని సౌకర్యాలు సిటీ సెంటర్లలోనే కాకుండా, శివారు ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వస్తే ప్రజలు ఒకే వైపు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. ఇటు విద్యుత్ వాహనాల (EV) వినియోగాన్ని 50 శాతానికి పెంచడం ద్వారా కాలుష్యాన్ని కూడా తగ్గించొచ్చు.

బెంగళూరు(Bengaluru ) ట్రాఫిక్ ఇండెక్స్ మనకు ఒక పెద్ద పాఠం. 2030 నాటికి హైదరాబాద్ జనాభా ఒక కోటి దాటుతుందని అంచనా ఉంది. అప్పటికి సిటీ ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా లేకపోతే, హైదరాబాద్ కూడా సంవత్సరానికి 120 గంటలకు పైగా రోడ్ల మీద ట్రాఫిక్ చూస్తూ గడపాల్సి వస్తుంది. కాబట్టి మెట్రో ప్రయారిటీ , పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనేవి ఇప్పుడు భాగ్యనగరానికి రక్షణ కవచంగా మారాల్సిన అవసరం ఉంది.

Abhishek Sharma : యువీ చెక్కిన విధ్వంసం..రికార్డులను షేక్ ఆడిస్తున్న అభిషేక్

Exit mobile version