WhatsApp :వాట్సాప్‌లో కొత్త ఫీచర్..బిజీ షెడ్యూల్‌లో సమయాన్ని ఆదా చేయండి

WhatsApp :కేవలం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్‌లకే కాకుండా, బిజీ షెడ్యూల్‌లో ఉండే ప్రొఫెషనల్స్, విద్యార్థులు, ఈవెంట్ ఆర్గనైజర్లకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

WhatsApp

బిజీ జీవితంలో ఒక గ్రూప్ కాల్ మాట్లాడాలంటే పడే కష్టం చాలామందికి అనుభవమే. సమయం చూసుకోవాలి, అందరికీ కుదిరే తేదీ ఎంచుకోవాలి, చివరికి కాల్ ప్రారంభమైనా ఎవరెవరు వస్తారో, ఎప్పుడు వస్తారో తెలియక గందరగోళం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా వాట్సాప్ ఒక అద్భుతమైన కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు వాట్సాప్‌లో గ్రూప్ కాల్స్‌ను ముందే ప్లాన్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌(WhatsApp)లో తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా, మీరు ఒక కాల్‌ను నిర్దిష్ట తేదీ, సమయం కోసం షెడ్యూల్ చేయవచ్చు. ఇది కేవలం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్‌లకే కాకుండా, బిజీ షెడ్యూల్‌లో ఉండే ప్రొఫెషనల్స్, విద్యార్థులు, ఈవెంట్ ఆర్గనైజర్లకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇకపై ఒక ముఖ్యమైన సమావేశం కోసమో, లేదా బంధువులందరితో మాట్లాడటం కోసమో గంటల తరబడి సమయం కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు.

Also read: Green chili: పచ్చిమిర్చి కారం కాదు.. కావాల్సినంత ఆరోగ్యం

షెడ్యూలింగ్ ప్రక్రియ చాలా ఈజీ. దీనికోసం ముందుగా, వాట్సాప్ కాల్స్ ట్యాబ్‌లోకి వెళ్లండి.అక్కడ ఉన్న కాల్ ఐకాన్‌పై నొక్కండి. మీరు ఏ గ్రూప్‌తో లేదా కాంటాక్టుతో మాట్లాడాలనుకుంటున్నారో ఎంచుకోండి. ఇప్పుడు షెడ్యూల్ కాల్ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కితే తేదీ, సమయం సెట్ చేసుకోవచ్చు. ఆడియో కాల్ కావాలో, వీడియో కాల్ కావాలో ఎంచుకుని, గ్రీన్ బటన్‌పై నొక్కడం ద్వారా కాల్ షెడ్యూల్ పూర్తవుతుంది.

Whatsapp

ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత, షెడ్యూల్ చేసిన కాల్ మీ వాట్సాప్‌లోని ‘రాబోయే కాల్స్’ సెక్షన్‌లో కనిపిస్తుంది. కాల్‌కు ముందు అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. దీనివల్ల ఎవరూ సమయాన్ని మర్చిపోకుండా సరిగ్గా కాల్‌లోకి జాయిన్ అవ్వగలుగుతారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ (WhatsApp)కేవలం కాల్ షెడ్యూలింగ్‌తోనే ఆగలేదు. కాల్ సమయంలో వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి కొన్ని కొత్త టూల్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు, ఎవరెవరు రియల్ టైంలో కాల్‌లో జాయిన్ అవుతున్నారో మీరు సులభంగా చూడొచ్చు. అంతేకాకుండా, ‘ఇన్వైట్ లింక్స్’ ద్వారా కొత్త సభ్యులు కాల్‌లోకి చేరినప్పుడు,క్రియేట్ చేసినవారికి ప్రత్యేకంగా అలర్ట్ వస్తుంది.

ఈ అన్ని ఫీచర్లను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షించబడ్డాయి. కాబట్టి, మీ సంభాషణలు సురక్షితంగా, ప్రైవేట్‌గా ఉంటాయన్న విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ సరికొత్త అప్‌డేట్‌తో వాట్సాప్ కేవలం మెసేజింగ్ యాప్‌గా కాకుండా, ప్రొఫెషనల్స్ అవసరాలను కూడా తీర్చే ఒక ఆధునిక కమ్యూనికేషన్ టూల్‌గా మారింది.

Exit mobile version