Google:నకిలీ వార్తలకు ఇక చెక్.. గూగుల్ కొత్త ఫీచర్ ఇదే

మీరు Google లో ఏదైనా వార్త గురించి వెతికినప్పుడు, "Top Stories" సెక్షన్‌కు పక్కన ఉండే చిన్న స్టార్ ఐకాన్‌పై క్లిక్ చేసి, మీకు నచ్చిన వెబ్‌సైట్‌లను లేదా వార్తా సంస్థలను ఎంచుకోవచ్చు.

Google

గూగుల్ (Google) సెర్చ్‌లో వార్తలు వెతుకుతున్నప్పుడు, ఏది నమ్మదగిన సమాచారం, ఏది నకిలీదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ గూగుల్ ఇటీవల ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ప్రెఫర్డ్ సోర్సెస్(Preferred Sources). ఈ ఫీచర్ ద్వారా మీరు నమ్మే వార్తలను మీరే ఎంచుకోవచ్చు, అంటే మీకు నచ్చిన వార్తా సంస్థల నుంచి మాత్రమే వార్తలు చూసే అవకాశం ఉంటుంది.

ఈ ఫీచర్ గూగుల్ సెర్చ్‌లోని టాప్ స్టోరీస్(Top Stories) సెక్షన్‌కు ఒక కొత్త లుక్ ఇచ్చింది. మీరు ఎంచుకున్న “Preferred Sources” నుంచి వచ్చే కొత్త వార్తలకు గూగుల్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.ఉదాహరణకు, మీకు ఒక నిర్దిష్ట న్యూస్ ఛానల్ లేదా వెబ్‌సైట్ నచ్చితే, వాటిని మీరు ఈ ఫీచర్‌లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత, మీరు వెతికిన సమాచారానికి సంబంధించిన వార్తలు ఆ సోర్సుల నుంచే ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా, గూగుల్ సెర్చ్ ఫలితాలలో ప్రత్యేకంగా ఫ్రమ్ యువర్ సోర్సెస్ (From your sources) అనే ఒక సెక్షన్ కూడా ఉంటుంది, ఇందులో మీరు ఎంచుకున్న సోర్సుల వార్తలు ఒకేచోట కనిపిస్తాయి.

Google

ఈ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. మీరు గూగుల్‌(Google)లో ఏదైనా వార్త గురించి వెతికినప్పుడు, “Top Stories” సెక్షన్‌కు పక్కన ఉండే చిన్న స్టార్ ఐకాన్‌పై క్లిక్ చేసి, మీకు నచ్చిన వెబ్‌సైట్‌లను లేదా వార్తా సంస్థలను ఎంచుకోవచ్చు. మీరు ఎప్పుడైనా మీ ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. దీనివల్ల మీరు నమ్మే సోర్సుల నుంచి మాత్రమే వార్తలను పొందుతారు. అలాగే, నకిలీ లేదా తక్కువ నాణ్యత ఉన్న వార్తలు మీకు కనిపించకుండా ఉంటాయి. ఈ ఫీచర్ వల్ల వార్తలను ప్రచురించే సంస్థలకు కూడా తమ పాఠకులను మరింత చేరుకునే అవకాశం ఉంటుంది, దీనితో వారి సైట్‌కు ట్రాఫిక్ పెరుగుతుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ భారతదేశంలో, అమెరికాలో ఇంగ్లీష్ భాషలో వెతికే వారికి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, గూగుల్ (Google) దీన్ని త్వరలో మరిన్ని భాషల్లో, మరిన్ని దేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ఫీచర్ వల్ల మీరు వెతికే సమాచారంపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది, ఇది గూగుల్ సెర్చ్‌ను మరింత వ్యక్తిగతంగా మారుస్తుంది. ఈ ఫీచర్ నమ్మకమైన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, మీకు మెరుగైన వార్తా అనుభవాన్ని అందిస్తుంది.

Also Read: Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు..ఆ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్

 

Exit mobile version