Phone calls :నెట్వర్క్‌తో పనిలేదు.. ఎక్కడైనా,ఎప్పుడైనా ఫోన్ కాల్స్

Phone calls :ఇకపై మొబైల్ నెట్‌వర్క్ లేదా వైఫై కనెక్షన్ లేకపోయినా, ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా నేరుగా వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

Phone calls

డిజిటల్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. ఈసారి టెక్ దిగ్గజం గూగుల్ మొబైల్ కనెక్టివిటీకి సంబంధించి ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సిగ్నల్ లేని ప్రాంతాల్లోనూ మాట్లాడేలా, గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్ల(Phone calls)లో శాటిలైట్ కాలింగ్ టెక్నాలజీని తీసుకువచ్చింది. 2025 ఆగస్టు 28 నుండి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై మొబైల్ నెట్‌వర్క్ లేదా వైఫై కనెక్షన్ లేకపోయినా, ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా నేరుగా వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

CIBIL score: సిబిల్ స్కోర్ ఎందుకంత ఇంపార్టెంటో తెలుసా?

శాటిలైట్ కాలింగ్: ఇది ఎలా పనిచేస్తుందంటే..ఈ అద్భుతమైన ఫీచర్ వెనుక ఉన్న సాంకేతికత చాలా సులభం. మీ ఫోన్‌కు మొబైల్ నెట్‌వర్క్ లేకపోతే, అది ఆటోమేటిక్‌గా శాటిలైట్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవుతుంది. కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్‌పై ఒక శాటిలైట్ గుర్తు కనిపిస్తుంది, దాని ద్వారా మీరు శాటిలైట్ కనెక్షన్‌లో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.

phone calls

ఈ టెక్నాలజీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ శాటిలైట్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి పనిచేస్తుంది. అయితే, దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఫోన్(Phone calls) వాడుతున్న వ్యక్తి ఆకాశం స్పష్టంగా కనిపించే బయట ప్రదేశంలో ఉండాలి. ఇళ్ల లోపల లేదా దట్టమైన చెట్ల కింద ఇది పనిచేయదు. అలాగే, ఇది క్యారియర్ సపోర్ట్‌తో మాత్రమే పనిచేస్తుంది, అందుకే T-Mobile వంటి క్యారియర్లు ఉన్న ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలకు అదనపు ఛార్జీలు ఉండే అవకాశం ఉంది.

ఇప్పటివరకు ఐఫోన్‌(Phone calls)లలో ఉన్న శాటిలైట్ ఫీచర్ కేవలం అత్యవసర మెసేజ్‌లకు మాత్రమే పరిమితం. కానీ పిక్సెల్ 10 సిరీస్‌లో ఇది నేరుగా వాట్సాప్ కాల్స్‌కు ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రయాణికులకు, గ్రామీణ, కొండ ప్రాంతాలు, అడవుల్లో ప్రయాణించే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అత్యవసర సమయాల్లోనే కాకుండా, సాధారణ కమ్యూనికేషన్ కోసం కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

phone calls

Mowgli: అదరగొట్టిన మోగ్లీ గ్లింప్స్..నాని, చరణ్‌ల సపోర్ట్

ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, యూరప్ దేశాల్లో మొదలయ్యింది. భారతదేశంలో ఇప్పటివరకు దీని విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు, కానీ భవిష్యత్తులో ఇక్కడి టెలికాం సంస్థల సహకారంతో ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ మొబైల్ కమ్యూనికేషన్‌లో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది.

 

Exit mobile version