Jubilee hills bypoll
సాధారణంగా ఉపఎన్నికల(Jubilee hills bypoll)పై పెద్దగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే ఒకటి,రెండు సీట్లకు బైపోల్ జరిగినప్పుడు ఏ రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ప్రభావం ఉండదు. అయితే తెలంగాణలో ఈ సారి జరగబోయే ఉపఎన్నిక మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి టెన్షన్ గా మారింది. రేవంత్ సర్కార్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం కాబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ గురించి జనం ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee hills bypoll) ప్రామాణికంగా తీసుకునే అవకాశముంటుంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే బిఆర్ఎస్ బిజెపి ఓ రేంజ్ లో ఆడుకుంటాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విషయాన్నిహైలైట్ చేస్తాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓటమిని రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ గా బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది.
జూబ్లీహిల్స్ (Jubilee hills bypoll)ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. మాగంటి భార్య సునీతకు టికెట్ ఇచ్చి, సెంటిమెంట్ తో నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే చనిపోతే వాళ్ల కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం ఆనవాయితీనే.
అదే ఫార్ములా అని ఇప్పుడు టిఆర్ఎస్ కూడా ఫాలో అవుతుంది. కానీ గతంలో కొన్నిసార్లు ఈ ఫార్ములా వర్కౌట్ కూడా కాలేదు. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి చనిపోయినప్పుడు…. ఆయన భార్య సుజాతకు టికెట్ ఇచ్చి టిఆర్ఎస్ గెలిపించుకోలేకపోయింది.
ఇప్పుడు అదే భయం ఆ పార్టీని వెంటాడుతుంది. ఇప్పటికే మిగిలిన రెండు పార్టీల అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బిజెపి నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో దిగారు. ప్రధానంగా పోటీ కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యనే ఉంది. బి ఆర్ఎస్ కేవలం సానుభూతి నమ్ముకుని బరిలో దిగింది. ఇక బిజెపి అభ్యర్థి ఎంపికలో కూడా జాప్యం చేసి తాను పోటీలో లేనని చెప్పకనే చెప్పింది.
అయితే ప్రభుత్వంలో అధికారంలో ఉండడం, అంగబలం అర్ధబలం దండిగా ఉండడం, చేతిలో అధికార యంత్రాంగం ఉండడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం. అదే సమయంలో సిటీలో మొదటి నుంచి బలమైన క్యాడర్, ఓటర్ల సపోర్ట్ ఉండడం బిఆర్ఎస్ బలం.2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ… సిటీలో బిఆర్ఎస్ 17 స్థానాలు గెలిచింది . అందుకే జూబ్లీహిల్స్, ఉప ఎన్నికల్లో గెలుస్తామని ఆశతో ఉంది.
అయితే ఉప ఎన్నికల్లో ఎప్పుడు అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ గెలిచేందుకు కూడా అవకాశాలున్నాయి. గతంలో నవీన్ యాదవ్ పోటీచేసిన ప్రతీసారీ తన ఓటు బ్యాంకును బాగానే సాధించగలిగారు. దీంతో ఈ పోటీ హోరాహోరీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంతో ప్రభుత్వం కూలిపోదు.. కానీ ఓడిపోతే మాత్రం రేవంత్ ఇమేజ్ చాలా వరకూ డ్యామేజ్ అవుతుందని చెప్పొచ్చు.