Jio : జియో యూజర్లకు షాక్..ఆ చవకైన ప్లాన్ ఇక లేదు

Jio:ప్రస్తుతం దేశంలో 5G ఫోన్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 4G ప్లాన్‌లకు స్వస్తి చెప్పి, వినియోగదారులను 5G రెడీ ప్లాన్‌ల వైపు మళ్లించాలని జియో భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Jio

రిలయన్స్ జియో వినియోగదారులకు ఒక చేదు వార్త. ఇప్పటివరకు జియో అందిస్తున్న అత్యంత చవకైన నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను సంస్థ సైలెంట్‌గా తొలగించింది. రోజువారీ డేటా వాడే యూజర్లకు ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. మీరు ఇదే ప్లాన్‌ను వాడుతున్నట్లయితే, మీ కోసం ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి.

గతంలో రూ. 249 ప్లాన్‌ ద్వారా రోజుకు 1GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మరియు ఇతర ప్రయోజనాలను జియో అందించేది. అయితే, ఇప్పుడు ఈ ప్లాన్‌ను జాబితా నుంచి తొలగించారు. ఈ మార్పుతో, జియోలో నెలవారీ ప్లాన్‌ల బేస్ ధర రూ. 299కి పెరిగింది.

కొత్త బేస్ ప్లాన్ ‌లో డేటా..రోజుకు 1.5GB, మొత్తం 42GB, వాయిస్ & ఎస్ఎంఎస్.. అపరిమిత కాలింగ్ , రోజుకు 100 ఎస్ఎంఎస్, సబ్‌స్క్రిప్షన్లు.. జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లు.గమనించాల్సిన విషయం ఏమిటంటే, రోజుకు 2GB కంటే తక్కువ డేటాను అందించే ప్లాన్‌లకు జియో ట్రూ 5G సర్వీసులు వర్తించవు. ఈ ప్లాన్ కేవలం 4G నెట్‌వర్క్‌లోనే పని చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నిర్ణయం వెనుక జియో వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 5G ఫోన్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 4G ప్లాన్‌లకు స్వస్తి చెప్పి, వినియోగదారులను 5G రెడీ ప్లాన్‌ల వైపు మళ్లించాలని జియో భావిస్తున్నట్లు తెలుస్తోంది.

jio

ఉదాహరణకు, రూ. 349 ప్లాన్‌ను పరిశీలిస్తే, ఇది రోజుకు 2GB డేటాను అందిస్తుంది. దీనికి 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ముఖ్యంగా, ఈ ప్లాన్‌తో జియో ట్రూ 5G సర్వీసులతో పాటు 90 రోజుల జియో (jio)హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. దీనివల్ల 5G ఫోన్ ఉన్న వినియోగదారులు సహజంగానే ఎక్కువ ప్రయోజనాలు ఉన్న ఈ ప్లాన్‌ల వైపు ఆకర్షితులవుతారు.

దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అప్పటివరకు జియో (jio)4G ప్లాన్‌లను కొనసాగించినా, భవిష్యత్తులో ఈ 4G ప్లాన్‌లు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని ఈ తాజా పరిణామం సూచిస్తోంది.

 

Exit mobile version