Notifications
నోటిఫికేషన్స్ (Notifications)మన ఫోకస్‌ని ఎలా పాడుచేస్తున్నాయి? – ఆధునిక జీవితంలో మౌనంగా జరుగుతున్న మానసిక నష్టంస్మార్ట్‌ఫోన్ మన జీవితాన్ని ఈజీ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కానీ అదే ఫోన్ నుంచి వచ్చే నిరంతర నోటిఫికేషన్స్ మన ఫోకస్‌పై ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయో చాలా మందికి ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. ఒక మెసేజ్, ఒక లైక్, ఒక చిన్న అలెర్ట్—ఇవి చూసేందుకు చాలా చిన్న విషయాల్లా అనిపించినా, మన మెదడు పనితీరుపై మాత్రం ఇవి దీర్ఘకాలికమైన, ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఒక్కసారి ఫోన్ నోటిఫికేషన్ వస్తే, దాన్ని కేవలం రెండు సెకన్లు చూసి మళ్లీ పనిలో పడతామని మనకు మనమే సర్దిచెప్పుకుంటాం. కానీ సైకాలజీ ప్రకారం ఇది అసాధ్యం.
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, ఒకసారి మన దృష్టి చెదిరితే, మళ్లీ అదే స్థాయి ఏకాగ్రతకు (Deep Focus) చేరుకోవడానికి మన మెదడుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం అవసరం. అంటే మీరు గంటలో కేవలం మూడుసార్లు ఫోన్ నోటిఫికేషన్ చూసినా, ఆ గంట మొత్తం మీ మెదడు అస్థిరంగానే ఉంటుంది తప్ప పూర్తిస్థాయిలో పనిపై దృష్టి పెట్టదు.
ఇదే కారణంగా చాలా మంది రోజంతా బిజీగా ఉన్నట్టు ఫీలవుతారు, కానీ చివరకు చేసిన పని మాత్రం ఆశించినంతగా ఉండదు. ఇక్కడ సమస్య టాలెంట్‌లో లేదు, టైమ్‌లోనూ లేదు. సమస్య మన ఫోకస్‌ను ప్రతి నిమిషం బ్రేక్ చేస్తున్న ఆ నోటిఫికేషన్స్‌లో ఉంది.
నోటిఫికేషన్స్ (Notifications)వల్ల కలిగే మరో పెద్ద సమస్య ఏమిటంటే, మెదడు ఎప్పుడూ అలర్ట్ మోడ్‌లోనే ఉండిపోవడం. ఏదైనా మిస్ అవుతానేమో అనే భయం మనలో నెమ్మదిగా పెరుగుతుంది. దీనినే సైకాలజీలో ఫోమో (FOMO – Fear of Missing Out) అని అంటారు.
ఈ భయం వల్ల మన మెదడు ఏ రోజూ పూర్తిగా రిలాక్స్ అవ్వదు. శరీరం విశ్రాంతిగా ఉన్నా, మెదడు మాత్రం నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. దీని ఫలితంగా చిరాకు, అలసట, నిద్రలేమి లాంటి సమస్యలు పెరుగుతాయి.
ఇంకా లోతుగా చూస్తే, నోటిఫికేషన్స్ (Notifications)మన మెదడులో డోపమైన్ అనే హార్మోన్‌పై ప్రభావం చూపుతాయి. ప్రతి నోటిఫికేషన్ ఒక చిన్న ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందానికి మెదడు అలవాటు పడిపోతే, సాధారణ జీవితంలో ఉండే చిన్న సంతోషాలు కూడా బోరుగా అనిపించడం మొదలవుతుంది.
దీని వల్ల చదవాలనిపించకపోవడం, ఓపిక తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల నిర్ణయశక్తి కూడా తగ్గిపోతుంది. దీనినే డెసిషన్ ఫటిగ్ అంటారు. ఈ స్థితిలో మెదడు అలసిపోయి ముఖ్యమైన విషయాల్లో స్పష్టత కోల్పోతుంది.
