AI: ఏఐతో మనిషికి కలిగే లాభాలు,నష్టాలు ఏంటో తెలుసా?

AI: మనం రోజువారీ వాడే స్మార్ట్ ఫోన్లలోని గూగుల్ అసిస్టెంట్ నుంచి, అమెజాన్ లో మనకు వచ్చే ప్రోడక్ట్ సలహాల వరకు అంతా ఏఐ మహిమే

AI

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ (AI) అనే మాట వినిపిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే, మనిషిలాగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకునేలా కంప్యూటర్లకు లేదా యంత్రాలకు శిక్షణ ఇవ్వడమే కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI).

మనం రోజువారీ వాడే స్మార్ట్ ఫోన్లలోని గూగుల్ అసిస్టెంట్ నుంచి, అమెజాన్ లో మనకు వచ్చే ప్రోడక్ట్ సలహాల వరకు అంతా ఏఐ మహిమే. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మానవ జీవనశైలిని పూర్తిగా మార్చేయబోతోంది. వైద్య రంగంలో ఏఐ ద్వారా వ్యాధులను స్టార్టింగ్ దశలోనే గుర్తించడం, రోబోల ద్వారా క్లిష్టమైన ఆపరేషన్లు చేయడం చాలా ఈజీ అవుతుంది.

అలాగే విద్యా రంగంలో ప్రతి స్టూడెంట్‌కు అతని సామర్థ్యానికి అనుగుణంగా ప్రత్యేకమైన లెసన్స్ నేర్పించడానికి ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం నుంచి వ్యవసాయంలో దిగుబడి పెంచడం వరకు అన్నింటిలోనూ ఏఐ పాత్ర కీలకం కానుంది.

AI

అయితే ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని ఆందోళనలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మనుషులు చేసే పనులను ఏఐ చేసేయడం వల్ల డేటా ఎంట్రీ, కస్టమర్ కేర్ వంటి విభాగాల్లో భారీగా ఉద్యోగాల కోత పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే ఇప్పటికే ఏఐ ద్వారా డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం, సైబర్ దాడులు చేయడం వంటివి సేఫ్టీకి పెను సవాలుగా మారాయి అవి ఇంకా పెరిగే అవకాశం ఉంది . మనిషి తన ప్రమేయం లేకుండా డెసిషన్ తీసుకునే శక్తి యంత్రాలకు వస్తే, అది భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.

అందుకే ఏఐని మనం ఒక సాధనంగా, అడిషనల్ సమాచారం తెలుసుకోవడానికో వాడుకోవాలి తప్ప, దానికి బానిసలు కాకూడదు. కొత్తగా వచ్చే టెక్నాలజీకి అనుగుణంగా మన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే మనం ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలం. ఏఐ అనేది మనిషికి శత్రువు కాదు, అది మనకు ఒక గొప్ప తోడుగా ఉండాలి అనేలా దీనిని వాడుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version