Metaverse: ఇంట్లోనే ఉండి ప్రపంచమంతా చుట్టేయడం సాధ్యమేనా?

Metaverse: మనకు నచ్చిన వర్చువల్ ప్రపంచంలో నడవొచ్చు, ఇతరులతో మాట్లాడొచ్చు, షాపింగ్ చేయొచ్చు, చివరికి సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు కూడా చూడొచ్చు.

Metaverse

ప్రస్తుతం మనం ఇంటర్నెట్ అంటే ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ ఇన్ఫర్మేషన్ పొందుతున్నాం. కానీ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూనే ఉంటుంది. దీనిలో భాగంగానే..మెటావర్స్(Metaverse) ఈ పద్ధతిని పూర్తిగా మార్చేసి ఇంకాస్త అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లోకి వెళ్లింది.

మెటావర్స్ (Metaverse)అనేది ఒక వర్చువల్ వరల్డ్. అంటే మనం భౌతికంగా మన ఇంట్లోనే ఉన్నా, ఒక ప్రత్యేకమైన వీఆర్ (VR) గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా ఆ డిజిటల్ ప్రపంచంలోకి నేరుగా ఎంటర్ అవ్వొచ్చు. అక్కడ మనకు ఒక ‘డిజిటల్ అవతార్’ (మనలాగే ఉండే ఒక బొమ్మ) ఉంటుంది. ఆ అవతార్ ద్వారా మనకు నచ్చిన వర్చువల్ ప్రపంచంలో నడవొచ్చు, ఇతరులతో మాట్లాడొచ్చు, షాపింగ్ చేయొచ్చు, చివరికి సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు కూడా చూడొచ్చు.

Metaverse

దీనివల్ల మెయిన్ లాభం ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కడో ఉన్న స్నేహితులను లేదా బంధువులను మనం డైరక్టుగా కలిసిన ఫీల్ కలుగుతుంది. ఆఫీసు మీటింగులు కూడా మనం ఇంట్లో ఉండి కూడా ఆఫీసులో కూర్చున్నట్లే నిర్వహించుకోవచ్చు. విద్యా రంగంలో విద్యార్థులు కూడా హిస్టరీ పాఠాలను కేవలం చదవడమే కాకుండా, ఆ కాలంలోకి వెళ్లి స్వయంగా చూస్తున్నట్లుగా అనుభూతి చెందొచ్చు.

అయితే దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. మనుషులు భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి వర్చువల్ ప్రపంచానికే బానిసలయ్యే ప్రమాదం ఉంది. అలాగే మనుషుల ప్రైవసీకి (Privacy) భంగం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, రాబోయే పదేళ్లలో మెటావర్స్ మన జీవితంలో ఒక భాగం కాబోతోందన్నది మాత్రం నిజం .

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version