WhatsApp: టైపు చేయకుండానే వాట్సాప్ మెసేజ్ పంపే ట్రిక్..

WhatsApp:టైపు చేయకుండా మెసేజ్ పంపే స్టెప్స్ ఫీచర్‌ను ఉపయోగించడానికి మూడు సింపుల్ స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి.

WhatsApp

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, బయట బిజీగా ఉన్నప్పుడు, లేదా ఎక్కువ టైపు చేయడం కష్టం అనిపించినప్పుడు వాట్సాప్‌లో (WhatsApp) మెసేజ్ పంపడం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా? అలాంటి సందర్భాల్లో మీకు బెస్ట్ సొల్యూషన్ వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్. దీని ద్వారా మీరు మాట్లాడితే చాలు, మీ మాటలు మెసేజ్‌గా మారిపోతాయి. టైపు చేయాల్సిన అవసరం లేకుండా త్వరగా మెసేజ్‌లు పంపడానికి ఈ ట్రిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇది ఎప్పుడో అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ దీనిని యూజ్ చేసేవాళ్లు తక్కువే ఉన్నారు.

టైపు చేయకుండా మెసేజ్ పంపే స్టెప్స్ ఫీచర్‌ను ఉపయోగించడానికి ఈ మూడు సింపుల్ స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.

Google Indic Keyboard డౌన్‌లోడ్: ముందుగా మీ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ నుండి “Google Indic Keyboard” యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ కీబోర్డ్ తెలుగుతో పాటు చాలా భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది.

వాయిస్ టైపింగ్ ఆప్షన్ ఉపయోగించడం: వాట్సాప్(WhatsApp) చాట్‌లో ఉన్నప్పుడు కీబోర్డ్ పైన కనిపించే మైక్ ఐకాన్‌ను నొక్కండి. ఇప్పుడు మీరు మాట్లాడటం మొదలుపెడితే, మీ మాటలు ఆటోమేటిక్‌గా టెక్స్ట్‌గా మారుతాయి.

సందేశం పంపడం: మీరు చెప్పిన టెక్స్ట్ సరిగ్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకొని, అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేసి మెసేజ్‌ను పంపేయండి.

Whatsapp

ఈ సులభమైన పద్ధతి ద్వారా మీరు టెక్స్ట్ చేయాల్సిన శ్రమను తగ్గించుకోవచ్చు, మీ కమ్యూనికేషన్‌ను మరింత సులభంగా, వేగంగా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే చాలామంది వాడకంలో ఉంది. మీరూ ఈ ట్రిక్ ద్వారా మీ మెసేజింగ్‌ను మరింత స్మార్ట్‌గా మార్చుకోండి.

 

Exit mobile version