Just TechnologyLatest News

WhatsApp: వాట్సాప్‌ కొత్త అప్‌డేట్ ఫీచర్ వచ్చేసింది

WhatsApp: ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన ఫోటోలన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్‌లో లాగే వాట్సాప్‌లోనూ ఒకే ఫ్రేమ్‌లో పెట్టడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది.

WhatsApp

ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్‌తోనో గడిపిన అందమైన క్షణాలను ఫోటోల రూపంలో వాట్సాప్ స్టేటస్‌గా పంచుకోవడం చాలామందికి ఇష్టం. ఇలాంటి వాళ్లు ఇప్పటివరకు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను పెట్టాలంటే చాలా కష్టపడేవారు. ప్రతి ఫోటోను ఒక్కోసారి స్టేటస్‌గా అప్‌డేట్ చేయడమో, లేదా వేరే యాప్‌ల సహాయంతో వాటిని కలిపి ఎడిట్ చేయడమో చేసేవారు. ఈ సమస్యకు వాట్సాప్ ఇప్పుడు ఒక చక్కటి పరిష్కారాన్ని తీసుకొచ్చింది. యూజర్ల సౌలభ్యం కోసం ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ (WhatsApp)స్టేటస్‌కు మ్యూజిక్‌ను యాడ్ చేసే ఫీచర్‌ను తీసుకొచ్చినట్లే, ఇప్పుడు ఫోటోల కోసం కూడా ఒక బిల్ట్-ఇన్ ఎడిటర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు ఒకేసారి గ్యాలరీ నుంచి ఆరు ఫోటోలను సెలక్ట్ చేసుకోవచ్చు. వాటిని మీకు నచ్చిన విధంగా ఒక అందమైన కొలేజ్‌గా మార్చుకుని, ఒకే స్టేటస్‌(WhatsApp collage feature)గా పెట్టేయొచ్చు. సో..ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన ఫోటోలన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్‌లో లాగే వాట్సాప్‌లోనూ ఒకే ఫ్రేమ్‌లో పెట్టడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది.

whatsapp
whatsapp

ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే, వాట్సాప్ స్టేటస్‌లోకి వెళ్లి ఫోటోలను ఎంపిక చేసుకునేటప్పుడు, అక్కడ మీకు లేఅవుట్ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా మీకు నచ్చిన ఫోటోలను గ్యాలరీ నుంచి సులభంగా ఎంచుకోవచ్చు. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా, మిగిలిన వారికి త్వరలోనే లభించనుంది. అంతేకాకుండా, స్టేటస్‌లో మ్యూజిక్ స్టిక్కర్స్, ఫోటో స్టిక్కర్స్ వంటి మరిన్ని సదుపాయాలు కూడా రానున్నాయి. ఈ కొత్త ఫీచర్‌తో ఫోటోలను ప్రత్యేకంగా ఎడిట్ చేయాల్సిన అవసరం లేకుండానే, మీ మధుర క్షణాలను మరింత ఆకర్షణీయంగా పంచుకోవచ్చు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button