Android phone:పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ను సీసీ కెమెరాగా మార్చేయండి ..

Android phone: చాలా మంది ఇళ్లలో పాత స్మార్ట్‌ఫోన్లు మూలన పడి ఉంటాయి. వాటిని తక్కువ ధరకు అమ్మేయడం కంటే ఇలా ఒక శక్తివంతమైన సెక్యూరిటీ కెమెరాగా మార్చుకోవడం చాలా తెలివైన పని.

Android phone

ప్రస్తుత రోజుల్లో ఇంటి భద్రత అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన అంశంగా మారింది. దీని కోసం వేల రూపాయలు ఖర్చు చేసి సీసీ కెమెరాలు కొంటుంటారు. అయితే మీ దగ్గర పాత ఆండ్రాయిడ్ ఫోన్(Android phone) ఉంటే చాలు మీరు ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ ఇంటిని పర్యవేక్షించవచ్చు. చాలా మంది ఇళ్లలో పాత స్మార్ట్‌ఫోన్లు మూలన పడి ఉంటాయి. వాటిని తక్కువ ధరకు అమ్మేయడం కంటే ఇలా ఒక శక్తివంతమైన సెక్యూరిటీ కెమెరాగా మార్చుకోవడం చాలా తెలివైన పని. ఇప్పటికే చాలామంది అలాగే వాడుతున్నారు.

పాత ఫోన్‌(Android phone)ను సిసి కెమెరాగా మార్చడం.. మీ పాత ఫోన్‌ను సిసి కెమెరాగా మార్చడానికి కొన్ని ప్రత్యేకమైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆల్ఫ్రెడ్ వీడియో సర్వైలెన్స్ (Alfred Video Surveillance) లేదా వార్డెన్ క్యామ్ (WardenCam) అనేవి చాలా ప్రజాదరణ పొందినవి. ఇవి గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తాయి. మీరు ప్రస్తుతం వాడుతున్న కొత్త ఫోన్ , మీ పాత ఫోన్ రెండింటిలోనూ ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.

రెండవ దశ లాగిన్ మరియు సెటప్.. రెండు ఫోన్లలో యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు ఒకే జీమెయిల్ అకౌంట్ ద్వారా రెండింటిలోనూ లాగిన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే రెండు ఫోన్ల మధ్య కనెక్షన్ ఏర్పడుతుంది. పాత ఫోన్ సెట్టింగ్స్‌లో కెమెరా (Camera) అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. మీరు ప్రస్తుతం వాడుతున్న కొత్త ఫోన్ సెట్టింగ్స్‌లో వ్యూయర్ (Viewer) అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

మూడవ దశ కెమెరా అమరిక.. ఇప్పుడు మీ పాత ఫోన్‌ను ఇంటిలో ఎక్కడైతే నిఘా అవసరమో అక్కడ అమర్చాలి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా పిల్లలు ఆడుకునే గదిలో లేదా హాల్ లో ఒక మొబైల్ స్టాండ్ సహాయంతో దీన్ని ఫిక్స్ చేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పాత ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఛార్జర్ ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండేలా చూసుకోవాలి. అలాగే మీ ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటే మరింత స్పష్టమైన వీడియోను మీరు ఎక్కడ ఉన్నా చూడొచ్చు.

Android phone

మోషన్ డిటెక్షన్ అలర్ట్స్ .. ఈ టెక్నాలజీలోని గొప్ప విషయం ఏమిటంటే మీ ఇంట్లో ఏవైనా కదలికలు జరిగితే అది వెంటనే గుర్తిస్తుంది. ఎవరైనా మీ ఇంటి లోపలికి వచ్చినా లేదా ఏదైనా వస్తువు కదిలినా మీ కొత్త ఫోన్‌కు వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల మీరు ఆఫీసులో ఉన్నా లేదా ఊరిలో ఉన్నా మీ ఇంటిని నిరంతరం కనిపెట్టుకుని ఉండవచ్చు.

టూ వే టాక్ సౌకర్యం.. ఈ యాప్స్ ద్వారా మీరు కేవలం వీడియో చూడటమే కాకుండా అవతలి వారితో మాట్లాడొచ్చు. ఉదాహరణకు మీ ఇంటి గుమ్మం దగ్గర ఎవరైనా ఉంటే మీరు మీ ఫోన్ ద్వారా వారితో మాట్లాడొచ్చు. మీ వాయిస్ అక్కడ ఉన్న పాత ఫోన్ స్పీకర్ ద్వారా వారికి వినిపిస్తుంది.

క్లౌడ్ స్టోరేజ్ , నైట్ విజన్.. మీ కెమెరా రికార్డ్ చేసే వీడియోలు ఆన్‌లైన్‌లో భద్రంగా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఫోన్ తీసుకెళ్లినా ఆ వీడియోలు మీ జీమెయిల్ అకౌంట్‌లో ఉంటాయి. అలాగే తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన చిత్రాలను చూసేందుకు ఇందులో నైట్ విజన్ మోడ్ కూడా ఉంటుంది.

ఎందుకు ఇది ఉత్తమమైన మార్గం.. మార్కెట్లో దొరికే ఐపీ కెమెరాలు కనీసం రెండు నుంచి మూడు వేల రూపాయలు ఉంటాయి. కానీ ఈ పద్ధతిలో మీకు సున్నా ఖర్చు అవుతుంది. పర్యావరణ పరంగా కూడా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించి పాత ఫోన్‌ను మళ్ళీ వాడుకోవడం మంచి పద్ధతి.

పాత ఫోన్(Android phone) ఎక్కువ సేపు ఆన్‌లో ఉండటం వల్ల వేడెక్కే అవకాశం ఉంటుంది. అందుకే దానికి గాలి తగిలేలా ఉంచాలి. అలాగే మీ వైఫై పాస్‌వర్డ్ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు.

టెక్నాలజీని తెలివిగా ఉపయోగిస్తే మన జీవితం చాలా సులభం అవుతుంది. ఈ రోజే మీ మూలన పడ్డ పాత ఫోన్ తీయండి పైన చెప్పిన విధంగా సెటప్ చేసి మీ ఇంటికి ఒక ఉచిత సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version