Quantum Computing
కంప్యూటర్ ప్రపంచంలో ఇప్పటివరకు అంతా అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసే సాంకేతికత ‘క్వాంటం కంప్యూటింగ్'(Quantum Computing) వచ్చేస్తోంది. మనం ప్రస్తుతం వాడుతున్న ల్యాప్‌టాప్‌లు లేదా సూపర్ కంప్యూటర్లు అన్నీ ‘బిట్స్’ (0 లేదా 1) ఆధారంగా పనిచేస్తాయి.
కానీ క్వాంటం కంప్యూటర్లు(Quantum Computing) ‘క్విబిట్స్’ అనే సూత్రంపైన పనిచేస్తాయి. ఇది ఒకే సమయంలో 0 , 1 రెండూ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల వేగం ఎవరూ ఊహించలేనంతగా పెరుగుతుంది. ఒక సూపర్ కంప్యూటర్ పది వేల ఏళ్లు తీసుకునే క్లిష్టమైన మేథ్స్ ప్రాబ్లెమ్‌ను క్వాంటం కంప్యూటర్ కేవలం 200 సెకన్లలోనే పరిష్కరించేస్తుంది.ఈ వేగం వల్ల వైద్య రంగంలో కొత్త మందుల తయారీ, స్పేస్ రీసెర్చ్ , వాతావరణ అంచనా వంటివి ఎంతో ఈజీ అవుతాయి.
అయితే, ఈ అపరిమిత వేగం వల్ల ఒక పెద్ద ముప్పు కూడా ఉందంటున్నారు టెక్ నిపుణులు. ప్రస్తుతం మనం వాడుతున్న అన్ని రకాల ఇంటర్నెట్ పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ సెక్యూరిటీని క్వాంటం కంప్యూటర్లు సెకన్లలో ఛేదించగలవు. అందుకే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఇప్పుడు ‘క్వాంటం ప్రూఫ్’ సెక్యూరిటీని డెవలప్ చేసే పనిలో ఉన్నారు.
2026 నాటికి గూగుల్, ఐబీఎమ్ వంటి సంస్థలు మరింత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్లను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఇది టెక్నాలజీ చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది కాబోతోంది. సామాన్యులకు ఇది డైరక్టుగా అందుబాటులోకి రాకపోయినా, మనం వాడే ప్రతి సర్వీసు వెనుక ఈ టెక్నాలజీ ప్రభావం కచ్చితంగా ఉండబోతుంది.
