Sleep: స్లీప్ టెక్నాలజీ అంటే ఏంటి? దీంతో మంచి నిద్ర సాధ్యమేనా?

Sleep ఒత్తిడి, టెన్షన్, పనిభారం,రాత్రిపూట స్మార్ట్‌ఫోన్ వాడకం వంటివి నిద్రలేమికి ప్రధాన కారణాలు అని నిపుణులు చెబుతున్నారు.

Sleep

ఇప్పుడు చాలామంది నిద్ర (sleep) పట్టకపోవడం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడి, టెన్షన్, పనిభారం,రాత్రిపూట స్మార్ట్‌ఫోన్ వాడకం వంటివి దీనికి ప్రధాన కారణాలు అని నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దీనివల్ల ఆరోగ్యం, మానసిక స్థితి దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా, టెక్నాలజీ ప్రపంచం కొన్ని అద్భుతమైన గ్యాడ్జెట్‌లను ముందుకు తీసుకువచ్చింది. వీటినే స్లీప్ టెక్నాలజీ అని పిలుస్తారు.

స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు..చాలా స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు ఇప్పుడు మన నిద్రను ట్రాక్ చేస్తాయి. మనం ఎంతసేపు నిద్రపోయాం, మన నిద్ర నాణ్యత (quality) ఎలా ఉంది, నిద్రలో మన గుండె కొట్టుకునే వేగం ఎలా ఉంది వంటి వివరాలను ఇవి సేకరిస్తాయి. ఈ డేటా ఆధారంగా, మనం మన నిద్ర అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో సూచిస్తాయి.

స్మార్ట్ బెడ్స్ (Smart Beds)..కొన్ని కంపెనీలు ఇప్పుడు స్మార్ట్ బెడ్స్‌ను తయారు చేస్తున్నాయి. ఇవి మన శరీర ఉష్ణోగ్రతను, మన గుండె కొట్టుకునే వేగాన్ని ట్రాక్ చేస్తాయి. మంచి నిద్ర(Sleep) కోసం మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం, లేదా స్లీప్ ట్రాకర్ డేటా ఆధారంగా బెడ్ పొజిషన్‌ను సర్దుబాటు చేయడం వంటివి చేస్తాయి. కొన్ని స్మార్ట్ బెడ్స్‌లో అలారం ఫీచర్ కూడా ఉంటుంది. ఇది మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కాకుండా, తేలికపాటి నిద్రలో ఉన్నప్పుడు అలారం మోగించి, మనల్ని నిద్రలేపుతుంది.

Sleep

స్లీప్ యాప్స్ (Sleep Apps).. మొబైల్ ఫోన్‌లో ఉండే కొన్ని యాప్‌లు కూడా మంచి నిద్ర)(sleepకు సహాయపడతాయి. మెడిటేషన్ యాప్స్, సున్నితమైన సంగీతం ప్లే చేసే యాప్స్, తెల్లని శబ్దం (White Noise) వినిపించే యాప్‌లు మన మనసును ప్రశాంతంగా ఉంచి, త్వరగా నిద్రలోకి జారుకోవడానికి సహాయపడతాయి.

అలారం లైట్లు (Alarm Lights):..కొన్ని లైట్లు ఉదయం నిద్రలేచే సమయానికి, సూర్యుడు ఉదయించినట్లుగా మెల్లగా వెలుగునిస్తాయి. దీనివల్ల మన మెదడు సహజంగా నిద్రలేవడానికి సిద్ధమవుతుంది.

ఈ టెక్నాలజీలు నిద్రలేమి సమస్యకు ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఇవి కేవలం సహాయం మాత్రమే చేస్తాయి. మంచి నిద్ర కోసం మనం మన జీవనశైలిని మార్చుకోవడం, సరైన సమయంలో నిద్రపోవడం, రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడటం మానేయడం వంటివి తప్పనిసరి.

Car-free cities: నార్వే,నెదర్లాండ్స్ కారు లేని నగరాలుగా ఎలా మారాయి?

Exit mobile version