Women
దేశ రాజధాని ఢిల్లీ వీధులు ఇప్పుడు భయంతో వణుకుతున్నాయి. అధికారం, రక్షణ, సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండాల్సిన ఢిల్లీ ఇప్పుడు మిస్సింగ్ కేసుల రాజధానిగా మారిపోవడం చాలా బాధాకరం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కేవలం 15 రోజుల వ్యవధిలోనే 807 మంది అదృశ్యం కావడం సామాన్యమైన విషయం కాదు.
దీనిలో 509 మంది మహిళలు(Women), బాలికలే ఉండటం చూస్తుంటే, సమాజంలో మహిళల రక్షణ ఏ స్థితిలో ఉందో అర్థమవుతోంది. ప్రతిరోజూ సగటున 54 మంది అదృశ్యమవుతున్నారనే లెక్కలు వింటే గుండె తరుక్కుపోతుంది. దీనిలో 191 మంది మైనర్లు కాగా, అందులో 146 మంది కేవలం బాలికలే. ముఖ్యంగా 12 నుంచి 18 ఏళ్ల లోపు టీనేజ్ అమ్మాయిలు ఎక్కువగా మాయం అవుతున్నారు. వీళ్లంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు వీళ్లను తీసుకెళ్తున్నారనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.
రికవరీ రేటును గమనిస్తే,807 మందిలో కేవలం 235 మందిని మాత్రమే కనుక్కున్నారు. మిగిలిన 572 మంది ఆచూకీ ఇప్పటికీ నిగూఢంగానే ఉంది. గతేడాది 2025 మొత్తం డేటాను పరిశీలిస్తే, 24,508 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 60 శాతానికి పైగా మహిళలే కావడం ఆందోళన కలిగించే విషయం .
ఈ అదృశ్యాల వెనుక అనేక భయంకరమైన కారణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక మాఫియాలా విస్తరించింది. ఢిల్లీ నుంచి నేపాల్ బార్డర్ వరకు ఈ నెట్‌వర్క్ చాలా బలంగా ఉంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగాల పేరుతోనో, మాయమాటలతోనో బాలికలను తరలిస్తున్నారు.
మరోవైపు లవ్ జిహాద్ , ప్రేమ పేరుతో పారిపోవడం వంటి కేసులు కూడా 30 శాతం వరకు ఉంటున్నాయి. టీనేజ్ అమ్మాయిలు సోషల్ మీడియా మాయలో పడి తెలియని వ్యక్తులతో వెళ్లిపోయి చివరకు అసాంఘిక శక్తుల చేతుల్లో చిక్కుకుంటున్నారు. ఇక డ్రగ్స్, ఇతర వ్యసనాలు కూడా ఈ మిస్సింగ్ కేసులకు కారణమవుతున్నాయి.
ఇక ఢిల్లీ జనాభా మూడు కోట్లకు చేరువలో ఉన్నా, పోలీస్ , జనాభా నిష్పత్తి కేవలం 1:500 గా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అంటే ఐదు వందల మందికి ఒక పోలీస్ మాత్రమే ఉన్నాడు. సిసిటివి కెమెరాలు లక్షల్లో ఉన్నా, వాటి మానిటరింగ్ వ్యవస్థ కుంటుపడటం వల్ల నిందితులను పట్టుకోవడం కష్టమవుతోంది.
దేశవ్యాప్త గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎన్‌సీఆర్‌బీ (NCRB) 2024 నివేదిక ప్రకారం, భారతదేశంలో ఏడాదికి దాదాపు 3.5 లక్షల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయట. ఇందులో ఉత్తరప్రదేశ్ 65,743 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 52,411 కేసులతో రెండో స్థానంలో ఉంది.
ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా, బెంగళూరు ,పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈలెక్కన దేశ సగటున ప్రతిరోజూ 959 మంది అదృశ్యమవుతున్నారు. వీరిలో మహిళల (Women) సంఖ్య 2.1 లక్షలు కాగా, చిన్నారులు 87 వేల మంది ఉంటున్నారు. రికవరీ రేటు 65 శాతంగా ఉన్నా, సుమారు 1.23 లక్షల మంది ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం విచారకరమే.
ఇక మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ విషయానికి వస్తే, ఇక్కడ కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో మిస్ అయినవి కాకుండా..ఒక్క 2024లో 12,345 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. దీనిలో 7,892 మంది మహిళలు(Women) ఉండగా, 3,118 మంది చిన్నారులు ఉన్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాలు ఈ అదృశ్యాలకు హాట్‌స్పాట్లుగా మారాయి. గుంటూరు , విజయవాడలోని కొన్ని ప్రాంతాలు హ్యూమన్ ట్రాఫికింగ్ రూట్స్ గా మారాయని, ఇక్కడి నుంచి బాలికలను తమిళనాడు , కేరళ వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
తెలంగాణలో 2024లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 15,678 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహిళలు(Women) 9,876 మంది ఉంటే, చిన్నారులు 4,023 మంది ఉన్నారు. ఒక్క హైదరాబాద్లోనే 4,567 కేసులు నమోదవ్వడం గమనార్హం. సౌత్ జోన్ , సెంట్రల్ జోన్ పరిధిలో అదృశ్యాల సంఖ్య ఎక్కువగా ఉంది.
హైదరాబాద్‌లోని పబ్ కల్చర్, డ్రగ్స్ వాడకం, ఐటీ హబ్ వల్ల వలసలు పెరగడం వల్ల అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెరిగి ఇలాంటి అదృశ్యాలకు దారితీస్తున్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 72 శాతంగా ఉన్నా కూడా, 4,444 మంది ఇంకా మిస్సింగ్ లోనే ఉండటం భయపెట్టే అంశం. తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులను ముంబై మీదుగా గల్ఫ్ దేశాలకు తరలించే నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయని నిఘా వర్గాల సమాచారం.
ఈ సమస్యపై జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. 2022లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయ సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. 2024లో హైదరాబాద్‌లో జనసేన నిర్వహించిన క్యాంపెయిన్ ద్వారా సుమారు 500 పైగా పాత కేసులను రీ-ఓపెన్ చేయించగలిగారు.
ఈ సంక్షోభాన్ని అరికట్టడానికి టెక్నాలజీ పరంగా ఫేస్ రికగ్నిషన్ (FR) సిస్టమ్ కలిగిన సీసీటీవీలను పెంచాలి. హైవేల మీద , అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద AI స్కానర్లను ఏర్పాటు చేయాలి. ప్రజలు అత్యవసర సమయంలో 100 (పోలీస్), 1098 (చైల్డ్ లైన్), 181 (మహిళా హెల్ప్‌లైన్) నంబర్లను సంప్రదించాలి.ఆడబిడ్డల భద్రత కోసం తల్లిదండ్రులు వీలైతే జీపీఎస్ (GPS) వాచ్‌లను వాడటం మంచిది.
Kalvakuntla Kavitha : కొత్త పార్టీ పెడుతున్నా…నా బలం ఏంటో చూపిస్తా
