Salary:నెల తిరగకుండానే శాలరీ ఖర్చయిపోతుందా ? ఈ రూల్ ఫాలో అయి డబ్బులు సేవింగ్ చేయండి..
Salary: ఆర్థిక క్రమశిక్షణ అనేది సంపాదనలో ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసీప్లీన్ అనేది మనం చేసే ఖర్చులోనే ఉంటుంది.
Salary
మధ్యతరగతి ప్రజలలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య నెలాఖరు కష్టాలు. జీతం(Salary) రాగానే ఇలా ఖర్చయిపోయి.. వారం తిరక్క ముందే చేతిలో వెయ్యి రూపాయలు కూడా మిగలని పరిస్థితి. ఎంత సంపాదించినా డబ్బులు ఎటు వెళ్తున్నాయో అర్థం కాదు.
ఇలాంటి వారికి ఆర్థిక నిపుణులు సూచిస్తున్న అద్భుతమైన సూత్రం 50-30-20 రూల్. ఈ సింపుల్ ఫార్ములాను పాటిస్తే, మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడమే కాకుండా, భవిష్యత్తు కోసం గొప్పగా పొదుపు చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శాలరీ(Salary) రాగానే ముందుగా 50 శాతం డబ్బులను మీ అవసరాల (Needs) కోసం కేటాయించాలి. అంటే మీ జీతంలో సగం డబ్బును ఇంటి అద్దె, రేషన్, కరెంట్ బిల్లులు, పిల్లల ఫీజులు, లోన్ ఈఎంఐల వంటి అత్యవసర ఖర్చులకు వాడాలి.
ఇక 30 శాతం మీ కోరికల కోసం వాడాలి. అంటే సినిమాలు, షాపింగ్, బయట రెస్టారెంట్లలో తినడం, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వంటి విలాసాలకు ఈ 30 శాతాన్ని మించి ఎట్టి పరిస్థితులలోనూ ఖర్చు చేయకూడదు. ఇక మిగిలిన 20 శాతం మీ భవిష్యత్తు పొదుపు (Savings) కోసం ఉంచుకోవాలి. ఇది మాత్రం చాలా ముఖ్యం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. జీతం రాగానే ముందుగా ఈ 20 శాతాన్ని తీసి పక్కన పెట్టాలి.

ఈ పొదుపు చేసిన 20 శాతం డబ్బును కేవలం బ్యాంక్ అకౌంట్లో ఉంచడం కాకుండా, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీ (SIP) లేదా గోల్డ్ స్కీమ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు, మీరు నెలకు 5 వేల రూపాయలను 20 ఏళ్ల పాటు సరైన చోట పెట్టుబడి పెడితే, కాంపౌండింగ్ పద్ధతిలో అది కొన్ని నెలల్లోనే లక్షల రూపాయలుగా మారుతుంది.
ఆర్థిక క్రమశిక్షణ అనేది సంపాదనలో ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసీప్లీన్ అనేది మనం చేసే ఖర్చులోనే ఉంటుంది. అందుకే ఈ 50-30-20 రూల్ను కనీసం ఆరు నెలలు పాటించి చూడండి.ఇలా చేస్తే మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా మీరు అతి కొద్ది రోజుల్లోనే లక్షాధికారి అయ్యే దిశగా అడుగులు పడతాయి.




One Comment