Bhadrachalam: గదిలో కెమెరా ..ప్రైవేట్ క్షణాలతో బ్లాక్ మెయిల్

Bhadrachalam: భద్రాచలం ఆలయం సందర్శనకు వచ్చిన ప్రేమ జంటకు ఎదురైన భయానక అనుభవం. లాడ్జ్‌లో గూఢంగా కెమెరాలు అమర్చి ప్రైవేట్‌ క్షణాలను రికార్డ్ చేసిన ముఠా.. వాటిని ఉపయోగించి బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు. బాధితుడి ధైర్యంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Bhadrachalam

తమ ప్రేమ పయనాన్ని భయానక అనుభవంగా మార్చేసిన ఘటన ఓ ప్రేమ జంటకు ఎదరైంది. భద్రాచలం ఆలయాన్ని దర్శించేందుకు వచ్చిన ఓ యువ జంటను, ఓ లాడ్జ్‌ ముఠా పక్కపక్కన ఉన్న ప్రేమికులనే లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌ పద్ధతిలో లూటీకి దిగింది. ప్రేమికుల ప్రైవేట్‌ మూమెంట్స్‌ను సీక్రెట్ కెమెరా(Secret camera) పెట్టి వీడియోలు తీశారు. ఆ తర్వాత వాటితో బెదిరింపులకు దిగారు. ఈ గుట్టురట్టు కావడానికి అసలైన కారణం ఏమిటంటే… బాధితుడైన యువకుడు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడమే.

ఈ దారుణం ఏప్రిల్‌ 16న భద్రాచలం (Bhadrachalam) లో జరిగింది. పాలిటెక్నిక్ చదువుతున్న 19 ఏళ్ల మహ్మద్‌ హర్షద్‌ అనే యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి భద్రాచలం(Bhadrachalam) రామాలయాన్ని దర్శించుకున్నాడు. దర్శనం అనంతరం వారు శ్రీ రఘురాం రెసిడెన్సీ అనే లాడ్జ్‌లో రూమ్ నెం.206లో బస చేశారు. అక్కడి సిబ్బంది అనుమతిలేకుండానే వారి గదిలో కెమెరాలు అమర్చి, వారి వ్యక్తిగత క్షణాలను రికార్డ్ చేశారు.

Bhadrachalam

వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి.. తొలుత హర్షద్‌కు మెసేజ్‌లు పెట్టారు. మొదట ఆయన ఖంగుతిన్నా, తర్వాత బెదిరింపులు తీవ్రమవుతూ ఉండటంతో చివరికి రూ.60,000 చెల్లించాల్సి వచ్చింది. కానీ, అక్కడితో ఆగలేదు ఆ ముఠా. మళ్లీ మళ్లీ డబ్బు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన హర్షద్‌ చివరికి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించాడు.

తన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బట్టబయలయింది. ఈ వీడియో రికార్డింగ్‌లకు లాడ్జ్ యజమాని పడాల వెంకటరామిరెడ్డి,మేనేజర్ సురగం భార్గవ్ సపోర్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు ఆధ్వర్యంలో కేసు నమోదు అవగా.. పలు సెక్షన్ల కింద కేసు దర్యాప్తు సాగుతోంది.

అయితే ఇలాంటి ఘటనలు లాడ్జిలు, ఓయో రూమ్స్, హోటళ్లలో సెక్యూరిటీ లేని స్థితిని ప్రశ్నిస్తున్నాయి. ప్రతీ ఒక్కరూ తమ ప్రైవసీని కాపాడుకోవడానికి ఏ స్థాయిలో అలర్ట్‌గా ఉండాలో ఈ ఘటన చెబుతోంది.

Also Read: Registered post : అతి త్వరలో చరిత్రలో కలిసిపోనున్న రిజిస్టర్డ్ పోస్ట్

Exit mobile version