Breakfast
హైదరాబాద్‌లోని పేదల ఆకలిని తీర్చడానికి ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. అది కేవలం ఒక కొత్త పథకం కాదు, ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న ఒక కార్యక్రమాన్ని మరింత విస్తరించనుంది.
నిజానికి, 2013లో రూ.5కే భోజనం అందించే కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షల మందికి పైగా దీనివల్ల లబ్ధి పొందారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, బస్తీ వాసులు, చిన్నపాటి ఉద్యోగులు వంటి వారికి ఈ చౌకైన భోజనం ఒక పెద్ద ఆసరాగా నిలిచింది. రోజూ సుమారు 60 వేల మందికి పైగా ప్రజలు ఈ భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా వారికి రుచితో పాటు శుచిగా ఉన్న భోజనం.. కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా తింటున్నారు.
అయితే, ఇప్పుడు ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ప్రభుత్వం కొత్తగా బ్రేక్‌ఫాస్ట్(Breakfast) స్కీమ్‌ను కూడా ప్రారంభిస్తోంది. ఇప్పటికే రూ.5కే భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలోనే ఈ అల్పాహారాన్ని కూడా అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం 139 చోట్ల ఉన్న ఈ క్యాంటీన్ల సంఖ్యను 150కి పెంచుతున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలాఖరులోగా ప్రారంభించనున్నారు.
ఈ కొత్త బ్రేక్‌ఫాస్ట్ (Breakfast)స్కీమ్‌తో రోజుకు 25 వేల మందికి పైగా ప్రజలకు అదనంగా లబ్ధి చేకూరనుంది. ఇది పేద ప్రజల ఆకలిని తీర్చడమే కాకుండా, వారికి ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని అందిస్తుంది. దీనివల్ల వారు ఉదయం పూట ఖాళీ కడుపుతో పనులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, పనిలో వారి ఉత్పాదకతను కూడా పెంచుతుంది.
ఈ పథకం విజయవంతమైతే, లక్షల మందికి పైగా ప్రజలు రోజుకు రెండు పూటలా పౌష్టికమైన భోజనం, అల్పాహారం కేవలం పది రూపాయలకే పొందగలుగుతారు. ప్రభుత్వం ఈ బ్రేక్‌ఫాస్ట్(Breakfast) స్కీమ్‌ను విజయవంతం చేయడం ద్వారా పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.