Dussehra
విద్యార్థుల జీవితంలో పండుగలు, సెలవులు రెండూ ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల లాంటివి. ఈ రెండూ కలిసొస్తే ఆ ఆనందానికి హద్దులే ఉండవు. ఈసారి దసరా పండుగ విద్యార్థులకు అలాంటి సంతోషాన్నే తీసుకురాబోతోంది. ప్రత్యేక పండుగలు, వారాంతాలు, రెండో శనివారాలు కలిసి రావడంతో స్కూలు విద్యార్థులకు సుదీర్ఘ సెలవులు రానున్నాయి.
సాధారణంగా దసరా అంటేనే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెలవుల సంబరం మొదలవుతుంది. ఈ ఏడాది కూడా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం విద్యార్థులకు భారీగా సెలవులు దక్కనున్నాయి.
ఈ సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌లో మొత్తం 233 పనిదినాలు ఉన్నాయి. అయితే, అన్ని సెలవులను కలుపుకుంటే దాదాపు 83 రోజులు సెలవులు వచ్చాయి. ఇది విద్యార్థులకు పాఠశాల ఒత్తిడి నుంచి విరామం తీసుకోవడానికి, కొత్త ఉత్సాహంతో తిరిగి పాఠశాలకు రావడానికి సహాయపడుతుంది. అయితే, ఇవి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చిన ప్రాథమిక వివరాలు మాత్రమే. పండుగకు దగ్గరగా వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా సెలవుల గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా (Dussehra)సెలవులు ఉండనున్నాయి. దీంతో పాటు, అక్టోబర్ 5, 6 తేదీలు వారాంతపు సెలవులుగా ఉన్నాయి. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు అయితే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉన్నాయి. ఈ సుదీర్ఘ సెలవులతో విద్యార్థులు తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి, దసరాను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది.
తెలంగాణ: తెలంగాణలోనూ దసరా సెలవుల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఇది సుమారు 13 రోజుల సుదీర్ఘ సెలవు. పండుగలు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో విద్యార్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
Also Read: OG: ఓజీలో కన్మణి వెనుక కథేంటి?