Train Terminal:శంషాబాద్ దగ్గరలోనే హై స్పీడ్ రైల్వే జంక్షన్‌.. ఈ అంతర్జాతీయ రవాణా హబ్ వల్ల హైదరాబాద్‌కు ప్లస్ ఏంటి?

Train Terminal : పూణే, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లే ఈ బుల్లెట్ రైళ్లుకు చెందిన హై స్పీడ్ రైల్వే జంక్షన్‌కు హైదరాబాద్‌ కేంద్రబిందువు అవుతుంది.

Train Terminal

హైదరాబాద్ త్వరలోనే మరో అంతర్జాతీయ మైలురాయిని అందుకోబోతోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు(Train Terminal )కారిడార్లలో అత్యంత కీలకమైన మూడు మార్గాలు కూడా హైదరాబాద్‌తోనే అనుసంధానం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పూణే, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లే ఈ బుల్లెట్ రైళ్లుకు చెందిన హై స్పీడ్ రైల్వే జంక్షన్‌కు(Train Terminal) హైదరాబాద్‌ కేంద్రబిందువు అవుతుంది.

హై స్పీడ్ రైల్వే జంక్షన్‌ను శంషాబాద్ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న బహదూర్‌గూడ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు 500 ఎకరాల భూమిని కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.

ఈ ప్రాజెక్టు వెంటనే కార్యరూపం దాల్చితే కనుక దక్షిణాది రాష్ట్రాల రవాణా ముఖచిత్రమే మారిపోతుంది. ముఖ్యంగా శంషాబాద్‌లోని సర్వే నంబర్ 28, 62 పరిధిలో ఉన్న దాదాపు 650 ఎకరాల ప్రభుత్వ భూములను అధికారులు ఇప్పటికే గుర్తించారు.

కాకపోతే ఈ భూములపై ఆధారపడి సాగు చేసుకుంటున్న రైతులకు తగిన పరిహారం అందించాక.. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీనివల్ల అటు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు, ఇటు బుల్లెట్ రైలు టెర్మినల్‌కు మధ్య అద్భుతమైన అనుసంధానత ఏర్పడి, హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ గేట్‌వేగా మారబోతోంది.

AI Generated Image

మామూలుగా రోడ్డు, రైలు మార్గంలో బెంగళూరు చేరుకోవడానికి 10 గంటలకు పైగా సమయం పడుతుంది. కానీ గంటకు 320 కి.మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హైస్పీడ్ రైళ్లు ఇక్కడ అందుబాటులోకి వస్తే, కేవలం రెండు గంటల్లోనే బెంగళూరుకు చేరుకోవచ్చు. ఇది ప్రయాణికులకు టైమును సేవ్ చేయడమే కాకుండా, తెలంగాణను దేశ మౌలిక సదుపాయాల రంగంలో టాప్‌లో నిలబెడుతుంది. రాజకీయంగా, ఆర్థికంగా రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు ఒక పెద్ద వరమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

హైస్పీడ్ రైలు ప్రాజెక్టు(Train Terminal ) వల్ల ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, పూణే వంటి నగరాలకు తరచుగా ప్రయాణించే వ్యాపారులకు, ఐటీ ఉద్యోగులకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇప్పుడు 10 గంటల పైన పట్టే ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుంది కాబట్టి, పనుల కోసం వెళ్లే వారికి ఇది పెద్ద వరం. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు విమానాశ్రయం నుంచే నేరుగా ఇతర నగరాలకు చేరుకునే వీలుంటుంది.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఈ టెర్మినల్ రావడం వల్ల హైదరాబాద్ దక్షిణ భారతదేశానికే ఒక మెయిన్ హబ్‌గా మారుతుందనేది విశ్లేషకుల మాట.

AI Generated Image

దీనివల్ల శంషాబాద్, బహదూర్‌గూడ, మహేశ్వరం,వెంకన్నగూడ, తిమ్మాపూర్ వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువలు పెరగడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా పుంజుకుంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల కొత్త హోటళ్లు, మాల్స్ ఏర్పడి వేల సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీంతో హైదరాబాద్ ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version