Hyderabad: పెడదోవలో కో లివింగ్ కల్చర్..  హాస్టల్స్ పై పోలీసుల నిఘా

Hyderabad: ముఖ్యంగా వీకెండ్ లోనే డ్రగ్ పెడ్లర్లు ఎక్కువగా సరఫరా చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఇక నుంచి హాస్టల్స్ పైనా, కో లివింగ్ ఫ్లాట్స్ పైనా పోలీసులు ఓ కన్నేసి ఉంచనున్నారు.

Hyderabad

పెరుగుతున్న సౌకర్యాలు, మారుతున్న పరిస్థితులతో ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఇబ్బందులు లేదా ప్రమాదాలు పొంచే ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలలో ఉండే విలాసవంతమైన జీవితం, పేరు, డబ్బు కొన్ని సందర్భాల్లో ముప్పుగా మారుతోంది. అది కూడా అన్ని రాష్ట్రాల ప్రజలకు చిరునామాగా ఉండే హైదరాబాద్ లో ఇటీవలే మొదలైన కో లివింగ్ కల్చర్/హాస్టల్స్ కొత్త దందాకు అడ్డాగా మారుతున్నాయి.

ప్రమాదకరమైన మత్తు పదార్థాల సరఫరాకు, వినియోగానికి కో లివింగ్ హాస్టల్స్, రూమ్స్ ఇప్పుడు చిరునామా అయిపోయాయి. వీటిలో ఎక్కువుగా చిక్కుకుంటోంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులే… డ్రగ్ పెడ్లర్ల టార్గెట్ కూడా వారే.. ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉండడం, లగ్డరీ లైఫ్ కు అలవాటు పడి కొత్త రుచులు కోరుకోవడం వంటివి ఇక్కడ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఇటీవల హైదరాబాద్ (Hyderabad)ఐటీ కారిడార్ లో కొన్ని కో లివింగ్ హాస్టల్స్ పై పోలీసులు దాడులు చేసారు. రాయదుర్గం అంజయ్య నగర్ లోని ఒక హాస్టల్ భారీగా డ్రగ్స్ దొరికాయి. గత కొంతకాలంగా హైదారాబాద్(Hyderabad) పోలీసులు డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిలో భాగంగా ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. దీంతో డ్రగ్ పెడ్లర్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు.

Hyderabad

ఈ ప్లాన్ లో భాగంగానే సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ నివసించే హాస్టల్స్ , కో లివింగ్ హాస్టల్ ను టార్గెట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల పోలీసులు జరిపిన దాడుల్లో ముగ్గురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. వారు గత కొంతకాలంగా డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తించారు. వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని కూడా పట్టుకున్నారు. ఐదంకెల జీతం, విలాసవంతమైన జీవితం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆడ, మగా తేడా లేకుండా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు విచ్చలవిడిగా గడిపేస్తున్నారు. కో లివింగ్ కల్చర్ పేరుతో కలిసే ఉంటున్నారు.

అది వారి వ్యక్తిగత విషయమే అనుకుంటున్నా.. ఈ క్రమంలో పెడదోవ పడుతున్నారు.మత్తు కోసం డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్ పై నిఘా పెట్టారు. హాస్టల్స్ యజమానులకు సైతం గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ముఖ్యంగా వీకెండ్ లోనే డ్రగ్ పెడ్లర్లు ఎక్కువగా సరఫరా చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఇక నుంచి హాస్టల్స్ పైనా, కో లివింగ్ ఫ్లాట్స్ పైనా పోలీసులు ఓ కన్నేసి ఉంచనున్నారు. అనవసరంగా మత్తు ఊబిలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ హెచ్చరిస్తున్నారు. కో లివింగ్ కల్చర్ పేరుతో తమ కెరీర్ లను తప్పుదోవకు తీసుకెళ్ళొద్దని సూచిస్తున్నారు. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న తమ పిల్లలపై తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు గమనించాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version