Milk well
నీళ్లు ఎప్పుడైనా తెల్లగా ఉంటాయా? అదీ పాలలాగా! అబద్ధం అనిపిస్తోంది కదూ? కానీ అది నిజం. ఒక గ్రామంలోని బావిలో నీళ్లు పాలలా (Milk well)తెల్లగా ఉంటాయట. అంతే కాదు, ఆ నీళ్లు తాగితే ఎన్నో రోగాలు నయమవుతాయని ఆ గ్రామ ప్రజలు నమ్ముతున్నారు. ఇంతకీ ఆ వింత బావి ఎక్కడ ఉంది? దాని రహస్యం ఏంటో తెలుసుకుందాం.”
కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, మొలంగూరు గ్రామంలో ఒక విచిత్రమైన బావి ఉంది. మనం సాధారణంగా చూసే నీలం రంగు నీళ్లకు భిన్నంగా, ఈ బావిలో నీళ్లు పాలలా తెల్లగా ఉంటాయి. కొత్త వాళ్లు చూస్తే వాటిని అస్సలు నమ్మరు. అందుకే ఈ బావికి ‘దూద్ బావి’ (పాల బావి) అని పేరు పెట్టారు. ఈ నీటి వెనుక ఉన్న రహస్యం ఏంటి? అవి నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయా?
చరిత్ర మరియు విశ్వాసం..ఈ బావిని నిజాం పాలన కాలంలో తవ్వించారు. ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మి, నిజాం నవాబు స్వయంగా ఈ బావిలోని నీటినే తాగేవారట. ఇక్కడి ప్రజలకు కూడా ఈ బావి(Milk well)పై అపారమైన నమ్మకం ఉంది. ఈ నీళ్లు తాగితే సర్వరోగాలు నయమవుతాయని, అందుకే వారు ఇంటింటికీ కుళాయిలు వచ్చినా సరే, ఈ బావి నీళ్లనే తాగుతున్నారని చెబుతారు.
ఈ నమ్మకాన్ని బలపరుస్తూ, దేశమంతా కరోనా విజృంభించినప్పుడు కూడా ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదట. ఈ బావి నీళ్లు (Milk well)తాగడం వల్లే కరోనా తమ గ్రామంలోకి రాలేదని గ్రామస్థులు గట్టిగా నమ్ముతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ నీటిని తీసుకెళ్తుంటారు. ఈ నీటి ప్రత్యేకతను తెలుసుకోవడానికి జలవనరుల సంస్థ కూడా దీనిపై పరిశోధనలు చేస్తోంది. ఈ నీళ్లలో ఎలాంటి ప్రత్యేకమైన మినరల్స్ ఉన్నాయనే దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.