Jubilee Hills by-poll:జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ టికెట్ ఆ నేతకే ?

Jubilee Hills by-poll:బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే నెలలో ఉపఎన్నిక జరగబోతోంది.

Jubilee Hills by-poll

తెలంగాణలో చాలారోజుల తర్వాత ఉపఎన్నిక (Jubilee Hills by-poll)హడావుడి కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే నెలలో ఉపఎన్నిక జరగబోతోంది. షెడ్యూల్ అధికారికంగా విడుదల కావడంతో టికెట్ ఆశించే ఆశావహులు తమ తమ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సతీమణికే టికెట్ ఖరారవగా… మిగిలిన పార్టీల్లో ఇంకా అభ్యర్థులు ఎవరనేది తేలాల్సి ఉంది.

ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ టికెట్ రేసులో చాలా పేర్లు వినిపించాయి. కొందరు హైకమాండ్ సూచనతో రేసులో నుంచి తప్పుకోగా… చివరికి నవీన్ యాదవ్ పేరు వినిపిస్తోంది. అతనికే టికెట్ ఖరారైనట్టు సమాచారం. నిజానికి కాంగ్రెస్ లో టికెట్ దక్కించుకోవడం మిగిలిన పార్టీలతో పోలిస్తే చాలా కష్టం.. నవీన్ యాదవ్ గత కొంతకాలంగా తన నియోజకవర్గంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

Jubilee Hills by-poll

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-poll).. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌కు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఉపఎన్నికల్లో గెలిస్తే ప్రజాభిప్రాయం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని , లేకుంటే వ్యతిరేకత మొదలైందని చెప్పుకుంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు. దీనిలో భాగంగానే అభ్యర్థి ఎంపిక విషయంలో హైకమాండ్‌కు తన అభిప్రాయం స్పష్టంగా చెప్పి.. నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయించాలని ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేతో, పార్టీ కీలక నేతలు మంత్రులతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. యాదవ సామాజికవర్గానికి టిక్కెట్ కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. గతంలో మజ్లిస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నవీన్ యాదవ్ వైపు రేవంత్ మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు మూడు రోజులు స్థానిక నేతలు, కార్యకర్తలతో చర్చలు జరిపి.. నాలుగు పేర్లను షార్ట్‌ లిస్ట్ చేశారు. వారిలో ప్రధానంగా బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ పేర్లు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. బొంతు రామ్మోహన్ తాను రేసులో లేనంటూ ప్రకటించడంతో ఇక నవీన్ యాదవ్ కే పక్కా అంటున్నారు. నవీన్ యాదవ్ కుటుంబానికి స్థానికంగా పట్టు ఉంది. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడిగా ఆయన నియోజకవర్గంలో కీలకంగా ఉంటారు.

2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి .. 9 వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్‌తో అవగాహన కారణంగా మజ్లిస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. సొంత బలంతోనే మూడో స్థానంలో నిలిచారు. అయితే నవీన్‌ తండ్రికి రౌడీ షీటర్‌ అనే పేరు ఉండటం ఆయనకు మైనస్‌గా మారింది. గతంలో MIMతో ఉన్న సంబంధాల కారణంగా.. హిందూ ఓటర్లలో కూడా నవీన్‌ పట్ల కాస్త వ్యతిరేకత ఉంది. అయినప్పటకీ నవీన్ వైపే కాంగ్రెస్ వర్గాలు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

Food: తెలుగువారి షడ్రుచుల భోజనం..బ్రహ్మ చెప్పిన అమృతం..!

Exit mobile version