Kavitha : రేవంత్ ఓటమే టార్గెట్..కవిత కోసం బరిలోకి పీకే

Kavitha : కవితతో పీకే భేటీ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది

Kavitha

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. సొంత కుటుంబసభ్యులతో గొడవలు వచ్చేందుకు కూడా రాజకీయాలే కారణమవుతున్నాయి. తండ్రి కేసీఆర్ తో విభేదించి , బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసిన ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఒంటరిగానే తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా మేధావులు, రాజకీయ నేతలతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

తాజాగా కవిత (Kavitha)రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (PK)తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఒకప్పుడు పలు కీలక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించి ఐప్యాక్ ద్వారా సేవలందించిన పీకే తర్వాత పార్టీ పెట్టి చావుదెబ్బ తిన్నారు. బిహార్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. దీంతో మళ్లీ తన పాత పని వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా కవిత(Kavitha) తో పీకే (PK) భేటీ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పీకేను వ్యూహకర్తగా నియమించుకుని ముందుకు వెళ్లాలని కవిత భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రజల కోసం కొత్త వేదిక కావాలంటూ ఇప్పటికే పలుసార్లు వ్యాఖ్యానించిన ఆమె పార్టీ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పెట్టబోతున్న పార్టీ ఎలా ఉండాలి.. దాని విధివిధానాలు, ప్రజలను ఆకట్టుకునే అంశాలు, హామీలు వంటి వాటిపై పీకేతో కవిత సుదీర్ఘంగా చర్చించారు. యువ నేతలతో పాటు తనతో కలిసి వచ్చే సీనియర్ నేతలను కలుపుకుని పార్టీని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Kavitha And PK

ప్రజలను ఆకర్షించేందుకు ఏం చేయాలనే దానిపై 50 కమిటీలను ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో మరింత లోతుగా చర్చించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. 2019లో ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించిన పీకే తర్వాత చెప్పుకోదగిన ఫలితాలు అందుకోలేకపోయారు. అదే సమయంలో సొంత రాష్ట్రంలో జన సురాజ్ పార్టీ పెట్టి ఫ్లాప్ అయ్యారు. అయినప్పటకీ పీకే పొలిటికల్ స్ట్రాటజీ బిజినెస్ కు మాత్రం ఎలాంటి ఢోకా లేదు.

ఆ అంశంలో పీకే బ్రాండ్ అలానే ఉండిపోయింది. అందుకే పలు రాజకీయ పార్టీల నుంచి ఇప్పటికీ ఆయనకు ఆఫర్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగానే కవిత (Kavitha) కూడా ప్రశాంత్ కిషోర్ (pk)సాయం తీసుకుంటున్నారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిస్తానంటూ గతంలో పీకే కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఓడిస్తానని, రాహుల్ గాంధీ కూడా కాపాడలేరంటూ మాట్లాడారు. ఇప్పుడు కవిత నుంచి ఆఫర్ రావడంతో వెంటనే అంగీకరించి ఆ దిశగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కవిత కొత్త పార్టీ గురించి, పీకే వ్యూహాల గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Vygha Reddy :పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే వారంతా వేస్ట్ ఫెలోస్..వైరల్ అవుతోన్న వైఘారెడ్డి కామెంట్స్

Exit mobile version