CM Revanth Reddy
గత కొన్ని నెలలుగా సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు నిర్మాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడం, వెంటనే ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేయడం చకాచకా జరిగిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.. కాకుంటే తెలంగాణలో మాత్రం దీనిపై పలువురు కోర్టుకెళ్లడం, నిర్మాతలకు న్యాయస్థానం చివాట్లు పెట్టడం జరుగుతోంది. తాజాగా రాజాసాబ్ టికెట్ ధరల పెంపు వేళ ఇదే పరిస్థితి ఎదురైంది.
దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy )చుట్టూ తిరుగుతున్నారు. హైకోర్టు తీర్పుతో షాక్ తిన్న పరిశ్రమలోని టాప్ ప్రొడ్యూసర్స్ రేవంత్ దగ్గరకు క్యూ కట్టారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy ) కలిసి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కొత్త జీవో తీసుకురావాలని కోరబోతున్నారు.
నిజానికి ఈ వివాదం రాజాసాబ్ మూవీ కోసమే మొదలైంది. టికెట్ ధరల పెంపుపై చివరి నిమిషం వరకూ ఎటూ తేల్చకపోవడం, గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత అనుమతి రావడం జరిగాయి. దీంతో ప్రీమియర్ షోస్ కోసం అర్థరాత్రి దాటిన తర్వాత పెంచిన ధరలతో టికెట్లు విడుదల చేసారు. అయితే దీనిపై ఓ న్యాయవాది కోర్టుకెళ్లారు. రూల్స్ కు విరుద్ధంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హోంశాఖ కార్యదర్శి మెమో జారీ చేయడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పిటీషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వం విడుదల చేసిన మెమోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. టికెట్ ధరలు పెంచబోమని గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది. అయినప్పటకీ ధరల పెంపుకు అనుమతిస్తూ మెమోలు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ ప్రశ్నించింది.
గతంలో అఖండ 2కు అధిక ధరలకు అనుమతించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెమోను కూడా నిలిపివేశారు. పెంచిన ధరలకు టికెట్లు అమ్మొద్దని కూడా అధికారులను ఆదేశించారు. అయితే కోర్టు తీర్పుతో షాక్ కు గురైన నిర్మాతలందరూ ఇప్పుడు సీఎం రేవంత్ (CM Revanth Reddy ) ను కలిసేందుకు సిద్ధమయ్యారు. పాత జీవోను రద్దు చేసి కొత్త జీవో ఇచ్చేలా సీఎంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు
Mana Shankar Varaprasad Garu:మన శంకర్ వరప్రసాద్ గారు.. ప్రీమియర్ షోల టైమింగ్స్, టికెక్ ధరల డిటైల్స్
