Mana Shankar Varaprasad Garu:మన శంకర్ వరప్రసాద్ గారు.. ప్రీమియర్ షోల టైమింగ్స్, టికెక్ ధరల డిటైల్స్
Mana Shankar Varaprasad Garu: అనిల్ రావిపూడి తనదైన మార్కు కామెడీ , ఎంటర్టైన్మెంట్ తో పాటు మెగాస్టార్ లోని వింటేజ్ మాస్ యాంగిల్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారట.
Mana Shankar Varaprasad Garu
సంక్రాంతి పండుగ వేళ బాక్సాఫీస్ వద్ద మెగా జాతరకు అంతా రెడీ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు (Mana Shankar Varaprasad Garu)సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడమే కాకుండా, టికెట్ ధరల పెంపుతో ఊరట లభించింది.
జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఏపీ ప్రభుత్వం ..జనవరి 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను గరిష్టంగా 500 రూపాయలుగా నిర్ణయించారు. ఇది పండుగ ముందు రోజే మెగాస్టార్ మాస్ విన్యాసాలను చూడాలనుకునే అభిమానులకు పెద్ద తీపి కబురు అనే చెప్పొచ్చు.
ఇక సాధారణ థియేటర్లలో వంద రూపాయలు, మల్టీప్లెక్స్ లలో నూట ఇరవై ఐదు రూపాయలు పెంచుకోవడానికి పది రోజుల పాటు అనుమతులు ఇవ్వడం సినిమా వసూళ్లపై సానుకూల ప్రభావం చూపనుందని మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా కథాంశం ,చిరంజీవి పాత్ర గురించి ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్తలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. అనిల్ రావిపూడి తనదైన మార్కు కామెడీ , ఎంటర్టైన్మెంట్ తో పాటు మెగాస్టార్ లోని వింటేజ్ మాస్ యాంగిల్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారట.
ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన , గెస్ట్ రోల్ లో కనిపిస్తుండటంతో, సినిమాలో వచ్చే ఫన్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని సమాచారం. చిరంజీవి తన అసలు పేరు శివశంకర్ వరప్రసాద్(Mana Shankar Varaprasad Garu) ను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ టైటిల్ తోనే సినిమా సగం విజయం సాధించిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో మెగాస్టార్ డాన్సులు, డైలాగ్ డెలివరీలో ఆయన పాత రోజులను గుర్తుకు తెస్తారని ఇటు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో టికెట్ ధరలపై ఇంకా స్పష్టత రాకపోయినా, ఏపీలో లభించిన ఈ వెసులుబాటుతో మెగాస్టార్ సంక్రాంతి విన్నర్ గా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.




2 Comments